కర్నె వెంకట కేశవులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర సమరయోధులు, రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జౌలి శాఖ సహకార మంత్రిగా పని చేశాడు.

కె.వి.కేశవులు
నియోజకవర్గం సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 14 జనవరి 1924
ధర్మపురి, జగిత్యాల జిల్లా , తెలంగాణ రాష్ట్రం
మరణం 30 జనవరి 2019 [1]
హైదరాబాద్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం హైదరాబాద్

జననం, విద్యాభాస్యం

మార్చు

కె.వి.కేశవులు 1924 జనవరి 14న తెలంగాణ రాష్ట్రం , జగిత్యాల జిల్లా, ధర్మపురిలో జన్మించాడు. ఆయన విద్యామస్యమంతా ధర్మపురిలో పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

కె.వి.కేశవులు భారత స్వతంత్ర ఉద్యమంలో కీలకంగా పని చేస్తూ ఆంద్రప్రదేశ్ స్వాతంత్ర సమరయోధుల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా పని చేశాడు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక హైదరాబాద్ (నైజాం) సంస్థానం భారతదేశంలో కలవలేదు. ఆయన నిజాం నిరంకుశపాలన గురించి ప్రజలను చైతన్య వంతులను చేయడం, వారి అరాచకాలను మొండిగా ఎదిరించి జాతీయ పతాకాన్ని రెప రెప లాడించి, నాటకాలు, సాహిత్యాలతో ప్రజలను కార్మోకులను చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశం ప్రభుత్వ పాలనలో విలీనమైన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

కె.వి.కేశవులు 1972, 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జౌళి శాఖ సహకార మంత్రిగా పని చేశాడు. [2]

మూలాలు

మార్చు
  1. Currentaffairs-Adda (2019). "Jan-2019 మరణాలు" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
  2. Telangana Reporter (2 February 2019). "స్వాతంత్ర్య సమరయెూధునికి ధర్మపురి ఘన నివాళి". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.

బయటి లింకులు

మార్చు