జగిత్యాల జిల్లా

తెలంగాణ లోని జిల్లా

జగిత్యాల జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.శాతవాహనుల తొలి రాజధాని,జగ్గదేవుడు పేరు మీద జగిత్యాల పేరు వచ్చింది.[1] 2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో రెండు రెవిన్యూ డివిజన్లు (జగిత్యాల, మెట్‌పల్లి), 18 మండలాలు, 286 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో నాలుగు నిర్జన గ్రామాలు.[2] ఈ జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి కరీంనగర్ జిల్లాలోనివి.జగిత్యాల పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రం.జగిత్యాల జిల్లా విస్తీర్ణం: 3,043 చ.కి.మీ. కాగా, జనాభా: 9,83,414, అక్షరాస్యత: 54.53 శాతంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు, బొంబాయి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

జగిత్యాల జిల్లా
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా స్థానం
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంజగిత్యాల
ప్రభుత్వం
 • జిల్లా కలెక్టరుA Sharath Kumar
విస్తీర్ణం
 • మొత్తం3,043 చ.కి.మీ. km2 (Formatting error: invalid input when rounding sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం9,85,417
జనాభా వివరాలు
 • అక్షరాస్యత60 శాతం
 • లింగ నిష్పత్తి1036
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుTS-02

స్థానిక స్వపరిపాలనసవరించు

Map
జగిత్యాల జిల్లా
జగిత్యాల జిల్లా

జిల్లాలో  ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 380 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

జిల్లాలోని మండలాలుసవరించు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (5)

దేవాలయాలుసవరించు

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం

● కోటేశ్వర స్వామి ఆలయం-కోటి లింగాల

● సాయి బాబా దేవాలయం-కోరుట్ల

● ఎల్లమ్మ ఆలయం- వెల్లుల్ల

జాతరలుసవరించు

కొండగట్టు - జాతర

జిల్లాలో నదులుసవరించు

● గోదావరి

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2018-03-12.
  2. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 226 Dt: 11-10-2016

వెలుపలి లింకులుసవరించు