కె.వి. రమేష్
కె.వి. రమేష్ భారతీయ తోలుబొమ్మలాట కళాకారుడు. యక్షగాన కళపై ఆధారపడిన ప్రదర్శనలలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అతను చాలా తరచుగా కర్ణాటక, కేరళలోని తుళునాడు ప్రాంతంలో ప్రదర్శనలు ఇస్తాడు. కాసర్‌గోడ్‌కు చెందిన శ్రీ గోపాలకృష్ణ యక్షగాన గొంబెయట సంఘానికి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు.[1]
కె.వి. రమేష్ | |
---|---|
విద్యాసంస్థ | కాలికట్ విశ్వవిద్యాలయం |
వృత్తి | తోలుబొమ్మల కళాకారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1981–ప్రస్తుతం |
శైలి | యక్షగానం |
కెరీర్
మార్చుకె.వి.రమేష్ తన తండ్రి కె. వెంకటకృష్ణయ్య వద్ద యక్షగాన తోలుబొమ్మలాట నేర్చుకున్నాడు. ఆయన కుటుంబం తరతరాలుగా యక్షగాన తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తోంది.[2] అతను కాలికట్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. కన్నడ, తుళు, మలయాళ భాషలలో ప్రదర్శనలు ఇస్తాడు.[3]
రమేష్ ప్రదర్శనతో పాటు బొమ్మలను కూడా సృష్టిస్తాడు. అతని ప్రదర్శన తెంకుతిట్టు శైలి యక్షగానంపై ఆధారపడి ఉంటుంది.[1] అతని శ్రీ గోపాలకృష్ణ యక్షగాన గొంబెయాట బృందం, 1981 నుండి ఇటువంటి ప్రదర్శనలు ఇచ్చింది. తేన్‌కుతిట్టు పద్ధతిలో యక్షగాన తోలుబొమ్మలాటను ప్రదర్శించే ఏకైక బృందం ఇది; ఉప్పినకుద్రులో ఉన్న ఏకైక ఇతర బృందం బడుగుతిట్టు శైలిలో ప్రదర్శన ఇస్తుంది.[4] 20వ శతాబ్దపు ప్రథమార్థంలో ఇటువంటి తోలుబొమ్మలాట బృందాలు 20 లేదా 30 ఉండేవని చెబుతారు.[5]
రమేష్, అతని బృందం గౌహతి, లాహోర్, ప్రేగ్ వంటి వైవిధ్యమైన ప్రదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు.[6]
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 M P, Nafeesa (14 August 2012). "The puppets that perform Yakshagana". The New Indian Express. Archived from the original on 4 March 2016. Retrieved 26 August 2012.
- ↑ M P, Nafeesa (14 August 2012). "The puppets that perform Yakshagana". The New Indian Express. Archived from the original on 4 March 2016. Retrieved 26 August 2012.M P, Nafeesa (14 August 2012). "The puppets that perform Yakshagana". The New Indian Express. Archived from the original on 4 March 2016. Retrieved 26 August 2012.
- ↑ "Shri Gopalakrishna Yakshagana Bombeyata Sangha". puppetindia.com. Archived from the original on 6 జూలై 2012. Retrieved 26 August 2012.
- ↑ "Document soon on Kasargod Yakshagana puppetry troupe". The Hindu. 12 September 2011. Retrieved 26 August 2012.
- ↑ Gosh, Banerjee; Sampa, Utpal Kumar; Banerjee, Utpal K. (2006). Indian puppets. New Delhi: Abhinav publications. p. 78. ISBN 978-8-1701-7435-6. Retrieved 16 August 2012.
- ↑ 6.0 6.1 "Yakshagana Puppetry troupe from Kasargod performs in Guhawati". The Hindu. 16 May 2011. Retrieved 26 August 2012.
- ↑ 7.0 7.1 "Carving a niche in puppetry". Deccan Herald.