సాహిత్య అకాడమీ

భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ
(కేంద్ర సాహిత్య అకాడమీ నుండి దారిమార్పు చెందింది)

సాహిత్య అకాడమీ (ఆంగ్లం: Sahitya Akademi) (హిందీ:साहित्य अकादमी ) (తెలుగు: సాహిత్య అకాడెమీ) భారతదేశానికి చెందిన ఒక సంస్థ. సాహిత్య పోషణకు, సహకారానికి, ప్రోత్సాహం కొరకు స్థాపించబడింది. భారతీయ భాషలలో ప్రముఖంగా సేవచేసిన వారికి ఇది సన్మానిస్తుంది. దీనిని మార్చి 12 1954, న స్థాపించారు. దీని నిర్వహణ భారత ప్రభుత్వం చేపడుతున్నది. సాహిత్య అకాడెమీ, సెమినార్లు, వర్క్‌షాపులు, సమావేశాలు, సదస్సులు చేపడుతుంది. పరిశోధకులకు, రచయితలకు, కవులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. రచనలకు, ముద్రణలకునూ ప్రోత్సాహకాలనిస్తుంది. పురస్కార గ్రహీతలకు రూ. 50,000 లు బహుమానం ప్రకటిస్తుంది. దీని గ్రంథాలయం, భారత్ లోనే అతిపెద్ద బహుభాషా గ్రంథాలయం. రెండు, ద్విమాస పత్రికలు ప్రచురిస్తూవుంది. అవి -- భారతీయ సాహిత్యం (ఆంగ్లంలో), సమకాలీన్ భారతీయ సాహిత్య్ (హిందీలో).

ఢిల్లీలోని రవీంద్ర భవన్

కార్యాలయాలు

మార్చు

ప్రధాన కార్యాలయం కొత్త ఢిల్లీ లో, ప్రాంతీయ కార్యాలయాలు బెంగుళూరు,కోల్కతా,ముంబాయి, చెన్నైలో ఉన్నాయి. పుస్తకాల విక్రయ కేంద్రం కొత్త ఢిల్లీలో ఉంది. బెంగుళూరు ప్రాంతీయ కార్యాలయం బెంగుళూరు విశ్వవిద్యాలయపు సెంట్రల్ కాలేజి భవన సముదాయములో (డా బి ఆర్ అంబేద్కర్ వీధి) (ఫోను : 91-80-22245152) వుంది

కార్యకలాపాలు

మార్చు

కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ భారతీయ సాహిత్య అభివృద్ధికి పలు కార్యకలాపాలు చేస్తోంది.

పురస్కారాలు

మార్చు

సాహిత్య అకాడమీ భారతీయ భాషల్లో సాహిత్యానికి సేవ చేసిన పలువురు సాహిత్యవేత్తలను వివిధ పురస్కారాల ద్వారా గౌరవిస్తోంది.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

మార్చు

ప్రధాన వ్యాసం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
భారతీయ సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారంగా పరిగణించే ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సాహిత్య అకాడమీ సాహిత్యవేత్తలకు అందిస్తోంది. రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన భాషలలో సాహిత్యసేవ చేసినవారికి ఈ పురస్కారాన్ని ఏటా పలు భాషల్లో అందజేస్తోంది. 1955 నుంచి ఏటా అందజేస్తున్న ఈ పురస్కారాలు తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషల్లో అందజేస్తారు. ఈ పురస్కారంతో పాటు మొదట రూ.5వేలు అందజేసేవారు. ఆ నగదు బహుమతి క్రమంగా పెరుగుతూ 2009 నాటికి రూ.లక్షకు చేరుకుంది.

భాషా సమ్మాన్ పురస్కారం

మార్చు

ప్రధాన వ్యాసం: భాషా సమ్మాన్ పురస్కారం
సాహిత్య అకాడెమీ జాబితాలో లేని రాజ్యాంగం అధికారికంగా గుర్తించని భాషలలో సాహిత్యం కోసం కృషిచేసిన సాహిత్యవేత్తలకు భాషాసమ్మాన్ పురస్కారాలు ఇస్తున్నారు. భాషావైవిధ్యం కలిగిన విస్తారమైన దేశంలో తాము చేయవలిసిన పని ఇంకా ఉందనే దృష్టితో సాహిత్య అకాడమీ ఈ పురస్కారాలు అందజేస్తోంది. 1996లో ఆయా భాషల అభివృద్ధికి కృషిచేసిన రచయితలు, పండితులు, సంపాదకులు, అనువాదకులు, సేకర్తలు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేస్తారు. సంస్థాపించినపుడు రూ.25వేల బహుమతితో ప్రారంభించిన ఈ పురస్కారం క్రమానుగుణంగా ప్రస్తుతం రూ.లక్షకు (2009 నుంచి) చేరుకుంది.

అనువాద బహుమతి

మార్చు

ప్రధాన వ్యాసం: సాహిత్య అకాడమీ అనువాద బహుమతి
సాహిత్య అకాడమీ ఏటా అందించే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలే కాక ఉత్తమ అనువాదాలకు సాహిత్య అకాడమీ బహుమతి కూడా అందిస్తున్నారు. 1989 నుంచి సాహిత్య అకాడమీ గుర్తించిన 24 భాషలలోని అనువాదకులకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు. బహుమతి సొమ్మును రూ.10వేలతో ప్రారంభించి ప్రస్తుతం రూ.50వేలు (2009 నాటి నుంచి) అందజేస్తున్నారు.

బాల సాహిత్య పురస్కారం

మార్చు

ప్రధాన వ్యాసం: సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం
బాలసాహిత్యం అభివృద్ధి చేసేందుకు సాహిత్య అకాడమీ వారు బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. ప్రతీ ఏడాదీ గుర్తించిన భాషల్లో వచ్చిన అత్యున్నత స్థాయి బాల సాహిత్యానికి పురస్కారం ప్రదానం చేస్తారు. ఐతే పురస్కారాన్ని ప్రకటించిన తొలి ఐదేళ్ళూ (2010-2014) రచయిత బాలసాహిత్యానికి చేసిన సేవ, బాలసాహిత్యరంగంలో వారి కృషిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని పురస్కారాన్ని అందిస్తున్నారు.

యువ పురస్కారం

మార్చు

ప్రధాన వ్యాసం: సాహిత్య అకాడమీ యువ పురస్కారం
యువతను సాహిత్యసృష్టి వైపుకు ఆకర్షించేందుకు, యవ్వనంలోనే సాహిత్యానికి సేవ చేసేవారిని సత్కరించేందుకు సాహిత్య అకాడమీ యువపురస్కారాలు అందిస్తోంది. 35 సంవత్సరాల లోపు వయసున్న సాహిత్యకారులు ఈ పురస్కారానికి అర్హులు.

గోల్డెన్ జూబ్లీ అవార్డు

మార్చు

సాహిత్య అకాడమీ తన స్వర్ణోత్సవం సందర్భంగా అనువాద రచనలకు అవార్డులు ఇచ్చింది. అనువాదానికి అవార్డులు రానా నాయర్, తపన్ కుమార్ ప్రధాన్, పరోమితా దాస్‌లకు లభించాయి. జీవితకాల సాధనకు గోల్డెన్ జూబ్లీ అవార్డులు, యువ పురస్కారాలు నామ్‌డియో ధసల్, మందక్రాంత సేన్, రంజిత్ హోస్కోటే, అబ్దుల్ రషీద్, సితార ఎస్, నీలాక్షి సింగ్.

ప్రచురణలు

మార్చు

కేంద్ర సాహిత్య అకాడమీ వారు పలు భారతీయ భాషల్లో గ్రంథప్రచురణలు చేపట్టారు. ఈ క్రమంలో పలు భాషల సాహిత్యాన్ని అనువదించడం, భారతీయ సాహిత్య నిర్మాతలుగా గొప్ప సాహిత్యవేత్తల గురించి బయోగ్రఫీలు ప్రచురించడం వంటివి చేస్తున్నారు.

సహాయక భాషలు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "awards & fellowships-Akademi Awards". web.archive.org. 2009-09-16. Archived from the original on 2009-09-16. Retrieved 2023-04-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

మార్చు