సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం

బాలసాహిత్యం అభివృద్ధి చేసేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది. ఈ పురస్కారాన్ని 2010నుండి అమలు చేస్తున్నారు. ప్రతీ ఏడాదీ గుర్తించిన భాషల్లో వచ్చిన అత్యున్నత స్థాయి బాల సాహిత్యానికి ఈ పురస్కారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో రచయిత బాలసాహిత్యానికి చేసిన సేవ, బాలసాహిత్యరంగంలో వారి కృషిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కారం పొందే బాలసాహిత్య పుస్తకం ఆ అవార్డును ఇచ్చే సంవత్సరానికి ముందు సంవత్సరానికన్నా ఐదేళ్ల కాలంలో వెలువడిఉండాలి. ఉదాహరణకు 2016లో అవార్డుకు పరిగణించే పుస్తకం 2011-2014 సంవత్సరాల మధ్యకాలంలో ప్రచురింపబడి ఉండాలి. ఈ పురస్కారం క్రింద రూ 50,000/- నగదు, జ్ఞాపిక బహూకరిస్తారు.

తెలుగు భాషకు చెందిన బాల సాహిత్య పురస్కార విజేతలు

మార్చు
సంవత్సరం బొమ్మ పుస్తకం సాహితీ విభాగం రచయిత మూలము
2010 అడవి తల్లి నవల కలువకొలను సదానంద [1]
2011 ఉగ్గుపాలు కథాసంపుటి ఎం.భూపాల్ రెడ్డి [2]
2012 చిరుదివ్వెలు కవితా సంపుటి రెడ్డి రాఘవయ్య
2013 ఆటలో అరటిపండు కథాసంపుటి డి. సుజాతాదేవి [3]
2014 ఆనందం కథాసంపుటి దాసరి వెంకటరమణ [4]
2015 బాలసాహిత్యంలో చేసిన మొత్తం కృషికి చొక్కాపు వెంకటరమణ [5]
2016 స్వర్ణపుష్పాలు కవితా సంపుటి అలపర్తి వెంకటసుబ్బారావు [6]
2017 బాలసాహిత్యంలో చేసిన మొత్తం కృషికి వాసాల నరసయ్య [7]
2018   ఆనందలోకం జానపద నవల నారంశెట్టి ఉమామహేశ్వరరావు [8]
2019 తాత మాట వరాల మూట కథల సంపుటి బెలగాం భీమేశ్వరరావు [9]
2022 బాలల తాత బాపూజీ గేయ కథ డా. పత్తిపాక మోహన్ [10]

మూలాలు

మార్చు
  1. 2010 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన
  2. 2011 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన[permanent dead link]
  3. "2013 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2016-06-29.
  4. "2014 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-03-06. Retrieved 2016-06-29.
  5. "2015 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన". Archived from the original on 2016-03-18. Retrieved 2016-06-29.
  6. "2016 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2016-08-04. Retrieved 2016-06-29.
  7. "2017 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2017-07-12. Retrieved 2017-06-23.
  8. "2018 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాల ప్రకటన" (PDF). Archived from the original (PDF) on 2018-07-12. Retrieved 2018-06-25.
  9. "Sahitya Akademi announces Bal Sahitya Puraskar and Yuva Puraskar 2019". pib.gov.in. Archived from the original on 2019-10-06. Retrieved 2019-10-06.
  10. telugu, NT News (2022-08-24). "ప‌త్తిపాక మోహ‌న్‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ బాల‌సాహిత్య పుర‌స్కారం". Namasthe Telangana. Archived from the original on 2022-08-24. Retrieved 2022-08-24.