కేఆర్ గౌరీ అమ్మ
కేఆర్ గౌరీ అమ్మ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు, కేరళ రాష్ట్ర తొలి ఆర్థిక శాఖ మంత్రి. ఆమె కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక నాయకుల్లోనూ ఒకరు. గౌరీ అమ్మ 1994లో జనతిపతియా సంరక్షణ సమితి (జేఎస్‌ఎస్) పార్టీని స్థాపించింది. ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తిరువనంతపురంలోని పీఆర్‌ఎస్ హాస్పిటల్‌లో 2021, మే 11న మరణించింది. [4][5][6]
కేఆర్ గౌరీ అమ్మ | |
---|---|
ఎమ్మెల్యే , ట్రావెన్కోర్-కొచ్చిన్ శాసనసభ | |
In office 1951–1954 | |
నియోజకవర్గం | చెర్తాలా |
ఎమ్మెల్యే ,ట్రావెన్కోర్-కొచ్చిన్ శాసనసభ | |
In office 1954–1957 | |
రాజప్రముఖ్ | చిత్తిర తిరుణాల్ బలరామ వర్మ |
నియోజకవర్గం | చెర్తాలా |
మొదటి ఈఎంఎస్ నంబూద్రిపాద్ మంత్రివర్గంలో | |
In office 5 ఏప్రిల్ 1957 – 31 జులై 1959 | |
గవర్నర్ | బూర్గుల రామకృష్ణ రావు |
అంతకు ముందు వారు | None |
తరువాత వారు | కె. చంద్రశేఖరన్ |
నియోజకవర్గం | చెర్తాలా |
2వ ఈఎంఎస్ నంబూద్రిపాద్ మంత్రివర్గంలో | |
In office 6 మార్చ్ 1967 – 1 నవంబర్ 1969 | |
గవర్నర్ | వి. విశ్వనాథన్ |
అంతకు ముందు వారు | కె. చంద్రశేఖరన్ |
తరువాత వారు | కెటి. జాకబ్ |
నియోజకవర్గం | చెర్తాలా |
మొదటి ఈ.కె .నయనార్ మంత్రివర్గంలో | |
In office 25 జనవరి 1980 – 20 అక్టోబర్ 1981 | |
గవర్నర్ | జోతి వెంకటాచలం |
నియోజకవర్గం | ఆరూర్ |
రెండవ ఈ.కె .నయనార్ మంత్రివర్గంలో | |
In office 26 మార్చ్ 1987 – 17 జూన్ 1991 | |
గవర్నర్ | పి.రామచంద్రన్ |
అంతకు ముందు వారు | పీకే. కున్హాలికుట్టి |
తరువాత వారు | ఈ. అహమ్మద్ |
నియోజకవర్గం | ఆరూర్ |
మూడవ ఏకే. ఆంటోనీ మంత్రివర్గంలో | |
In office 17 మే 2001 – 29 ఆగష్టు 2004 | |
గవర్నర్ | సుఖ్ దేవ్ సింగ్ కాంగ్ |
అంతకు ముందు వారు | వికె. రాజన్ & కృష్ణన్ కనియంపరాంబి |
నియోజకవర్గం | ఆరూర్ |
మొదటి ఊమెన్ చాందీ మంత్రివర్గంలో | |
In office 31 ఆగష్టు 2004 – 12 మే 2006 | |
గవర్నర్ | ఆర్.ఎల్.భాటియా |
తరువాత వారు | ముళ్ళక్కర రెత్నాకరణ్ |
నియోజకవర్గం | ఆరూర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కలతిల్పరంబిల్ రామన్ గౌరియమ్మ 1919 జూలై 14 [1][2] చెర్తాలా, అలప్పుజ జిల్లా, కేరళ రాష్ట్రం |
మరణం | 2021 మే 11 తిరువనంతపురం చతనడ్ కేరళ | (వయసు 101)
జాతీయత | భారతదేశం |
రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) జనతిపతియా సంరక్షణ సమితి |
జీవిత భాగస్వామి | టివి థామస్, మాజీ మంత్రి (1957–1977) [3] |
తల్లి | అరుమురి పరంబిల్ పార్వతి అమ్మ |
తండ్రి | కలతిల్పరంబిల్ రామన్ |
బంధువులు | సుశీల గోపాలన్ |
నివాసం | చాథనాడ్, అలప్పుజ |
కళాశాల | హైయర్ సెకండరీ స్కూల్ కండమంగళం, ఎర్నాకుళం, ఎల్.ఎల్.బి ప్రభుత్వ న్యాయ కళాశాల, తిరువనంతపురం |
పురస్కారాలు | కేరళ సాహిత్య అకాడెమీ అవార్డు |
వెబ్‌సైట్ | Government of Kerala |
మారుపేరు | గౌరీ థామస్, కేరళ సిమ్హి & వాయలార్ రాణి |
జననం, విద్యాభాస్యం
మార్చుకె.ఆర్.గౌరీ అమ్మ 1919లో జూలై 14న కేరళ రాష్ట్రం, అలప్పుజ జిల్లా, చెర్తాలా గ్రామంలో అరుమురి పరంబిల్ పార్వతి అమ్మ, కలతిల్పరంబిల్ రామన్ దంపతులకు జన్మించింది. ఆమె పదవ తరగతి వరకు తురవూర్ లో పూర్తి చేసి, ఇంటర్మీడియట్ సెయింట్ తెరిసా కళాశాలలో పూర్తి చేసింది. తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. గౌరీ అమ్మ కేరళ రాష్ట్రంలోని ఈజావా వర్గానికి చెందిన మొదటి మహిళా న్యాయ విద్యార్థిని. [7]
రాజకీయ జీవితం
మార్చుకేఆర్ గౌరీ అమ్మ ట్రావెన్కోర్-కొచ్చిన్ శాసనసభకు చెర్తాలా నియోజకవర్గం నుండి 1951లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది.ఆమె రెండవసారి 1954లో ఎమ్మెల్యేగా గెలిచి 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని మొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయిన తరువాత ఆమె సీపీఎంలో చేరింది. కేఆర్ గౌరీ 1994లో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆమె జనతిపతియా సంరక్షణ సమితి (జేఎస్‌ఎస్) పార్టీని స్థాపించింది. ఆమె చివరిసారిగా 2011లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. అప్పటి నుండి వృద్ధాప్య కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Members - Kerala Legislature". web.archive.org. 28 January 2021. Archived from the original on 28 జనవరి 2021. Retrieved 11 మే 2021.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "JSS leader K R Gouri Amma, 102, no more". Mathrubhumi.
- ↑ Madhyamam, മാധ്യമം (11 May 2021). "ഗൗരിയമ്മയും ടി.വി. തോമസും -കേരള രാഷ് ട്രീയത്തിലെ ഏക മന്ത്രി ദമ്പതികൾ | Madhyamam". www.madhyamam.com. Archived from the original on 11 మే 2021. Retrieved 11 May 2021.
- ↑ Mathrubhumi (11 May 2021). "JSS leader K R Gouri Amma, 102, no more". Archived from the original on 11 మే 2021. Retrieved 11 May 2021.
- ↑ Namasthe Telangana (11 May 2021). "కేరళ తొలి రెవెన్యూ మంత్రి కేఆర్ గౌరీ అమ్మ కన్నుమూత". Archived from the original on 11 మే 2021. Retrieved 11 May 2021.
- ↑ Sakshi (11 May 2021). "గౌరీ అమ్మ ఇక లేరు: గవర్నరు, సీఎం సంతాపం". Sakshi. Archived from the original on 11 మే 2021. Retrieved 11 May 2021.
- ↑ V6 Velugu (11 May 2021). "కేరళ తొలి రెవెన్యూ మంత్రి గౌరీ అమ్మ ఇకలేరు". Archived from the original on 11 మే 2021. Retrieved 11 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)