కేతకి సంగమేశ్వర దేవాలయం
కేతకి సంగమేశ్వర దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని ఝరాసంగం గ్రామంలో ఉన్న దేవాలయం. మంజీర నదీతీరంలో వెలసి, పురాతన శైవక్షేత్రంగా, దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ దేవాలయంలోని శివుడికి మొదట బ్రహ్మదేవుడు కేతకీ (మొగలి) పుష్పాలతో పూజించాడు.[1]
కేతకి సంగమేశ్వర దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 17°45′50″N 77°42′44″E / 17.7638°N 77.7123°E |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | సంగారెడ్డి జిల్లా |
ప్రదేశం: | ఝరాసంగం, ఝరాసంగం మండలం |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | సంగమేశ్వరుడు |
చరిత్ర
మార్చుకేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతకీ వనం (మొగలి వనం)గా మారింది. ఆ కేతకీ వనంలో బ్రహ్మ కూర్చొని శివుని గూర్చి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడు. అలా ఈ క్షేత్రానికి కేతకీ సంగమేశ్వర క్షేత్రమని పేరు వచ్చిందని స్కంద పురాణంలో చెప్పబడింది.[2]
కృతయుగంఈ ప్రాంతానికి కుపేంద్ర రాజు చర్మవ్యాధితో బాధపడుతున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి కేతకీ వనంలోని నీటి గుండంలో స్నానం చేయగా రాజుకు పూర్తిగా స్వస్థత చేకూరింది. అదేరోజు రాత్రి సంగమేశ్వరస్వామి రాజు కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడు.
విశిష్టత
మార్చుదేవాలయానికి వెనుకభాగంలో పెద్ద గుండం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. కాశీలో ప్రవహించే గంగా నది ఝరా (జలం) భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేసి, స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితోపాటు ఆ రంధ్రం నుండి వెళ్ళిపోతుంది. కాసేపటితర్వాత మళ్ళీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది.[3]
పూజలు-ఉత్సవాలు
మార్చుఈ దేవాలయంలో అన్నపూజ, తమలపాకులు, చెరుకు ముక్కలతో నిత్య పూజలతోపాటు సోమ, శుక్రవారాలు, ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, తొలి ఏకాదశి, శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి. ప్రతి సంవత్సరం మహశివరాత్రి సందర్భంగా తొమ్మిదిరోజులపాటు పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.[4] కార్తీక మాసంలో పార్వతీ సంగమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది.
మూలాలు
మార్చు- ↑ "Welcome to Official Website of Telangana Tourism Corporation". tourism.telangana.gov.in. Archived from the original on 2021-11-30. Retrieved 2021-11-30.
- ↑ Telugu, TV9 (2021-01-11). "Sri Ketaki Sangameshwara Temple". TV9 Telugu. Archived from the original on 2021-11-30. Retrieved 2021-11-30.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sumitra (2020-08-16). "Ketaki Sangameshwara Temple : కేతకి అనే అప్సరస మొగలి వనంగా మారింది ఇక్కడే". www.hmtvlive.com. Archived from the original on 2021-11-30. Retrieved 2021-11-30.
- ↑ "భక్తులతో కిటకిటలాడుతున్న కేతకి సంగమేశ్వర ఆలయం". ETV Bharat News. Archived from the original on 2021-11-30. Retrieved 2021-11-30.