కేతవరపు రామకోటిశాస్త్రి

జీవిత విశేషాలు మార్చు

1931లో జన్మించాడు. వినుకొండ, గుంటూరులో విద్యాభ్యాసం చేశాడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి బి.ఎ. ఆనర్స్ చేశాడు. 1954లో గుడివాడ కాలేజీలో లెక్చెరర్‌గా చేరి 3 సంవత్సరాలు పనిచేశాడు. అక్కడ త్రిపురనేని మధుసూధన రావు, చలసాని ప్రసాద్, శివసాగర్ మొదలైన వారు ఇతనికి శిష్యులుగా ఉన్నారు. 1959 ప్రాంతంలో హైదరాబాదు చేరి బిరుదురాజు రామరాజు పర్యవేక్షణలో తిక్కన కావ్యశిల్పము తత్త్వదర్శనము అనే అంశం మీద పి.హెచ్.డి చేశాడు. నిజాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరాడు. తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం పి.జి.సెంటర్‌లో తెలుగుశాఖలో ఉపన్యాసకుడిగా నియమించబడ్డాడు. తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతని పర్యవేక్షణలో కోవెల సంపత్కుమారాచార్య ఆధునిక తెలుగుసాహిత్య విమర్శ - సంప్రదాయిక రీతి అనే అంశంపై, వరవరరావు తెలంగాణ విమోచన ఉద్యమం తెలుగునవల అనే అంశంపై పరిశోధనలు జరిపి పి.హెచ్.డి పట్టాలు పొందారు.

ఇతని భార్యపేరు ఇందిరాదేవి. ఇతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాత్యాయనీ విద్మహే, మైథిలీ ధీమహీ, శ్రీగౌరీ ప్రచోదయాత్ అని వారికి పేర్లుపెట్టడంలో ఇతని సాహిత్యాభిరుచి కనిపిస్తుంది. కాత్యాయనీ విద్మహే ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2013 సంవత్సరానికిగాను ఈమెకు కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.

రచనలు మార్చు

 1. విశ్వనాథవైఖరి<ref>కేతవరపు, రామకోటిశాస్త్రి (1994). విశ్వనాథవైఖరి (1 ed.). వరంగల్లు: జిజ్ఞాస ప్రచురణలు.
 2. సాహిత్యసంభావన
 3. ఆధునిక తెలుగు సామాజికకవిత్వ ఉద్యమాలు
 4. అభ్యుదయ వాద సాహిత్య విమర్శన దృక్పథం
 5. కావ్యజిజ్ఞాస
 6. మళ్లీ కన్యాశుల్కం గురించి
 7. పోతన్నగారి వైచిత్రి
 8. శ్రీ ఘటికాచల మహాత్మ్యము (సంపాదకత్వం)
 9. ఆశుకవితలు, అవధానములు - చాటువులు
 10. భారతీయ సాహిత్యశాస్త్రం: భిన్నసంప్రదాయాలు - దృక్పథాలు
 11. భాషాసాహిత్యాలు - సామాజిక భావనలు
 12. దృష్టి - దృశ్యం: తెలుగులో సాహిత్య విమర్శ పరిశోధన
 13. మహిళా సమాజ వాద సాహిత్య వ్యాసాలు
 14. నాచన సోముడు
 15. నాటక విశ్లేషణ
 16. ఒకే ఇద్దరము (కావ్యము)
 17. పురాణేతిహాసాలు, విశేష విశ్లేషణలు
 18. సమీక్షణ
 19. తిక్కన హరిహరనాథ తత్వము
 20. తిక్కన కావ్యశిల్పము
 21. విశ్వనాథ వాజ్మయ సూచిక
 22. ఆనంద చేతన (కావ్యము)
 23. మహాభారత దర్శనం
 24. నైమిషం
 25. శతృంజయము (కావ్యము)
 26. అనంగహేల (కావ్యము)
 27. చిచ్చేతన (కావ్యము)
 28. రాజరాజేశ్వరీశతకము
 29. కృష్ణద్యూతము (కావ్యము)

మూలాలు మార్చు

బయటిలింకులు మార్చు