కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003)

(కేతు విశ్వనాథ రెడ్డి కథలు నుండి దారిమార్పు చెందింది)

కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003)అనే కథలసంపుటి విద్యావేత్త,సాహిత్యపరిశోధకుడు,విమర్శకుడు, అద్యాపకుడు అయిన ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి చే రచించబడింది.

పుస్తకం ముఖ చిత్రం
కేతు విశ్వనాథరెడ్డి

పుస్తక ప్రచురణ వివరాలు

మార్చు

కేతు విశ్వనాథరెడ్డి కథలు అనే కథాసంపుటం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్ వారిచే ప్రచురింపబడింది.ఈ పుస్తకము 13 కథల సంకలనము.ఇవన్నీ 1998 నుండి 2003 వరకు వివిధ పత్రికలలో ప్రచరింపబడినవే.విశాలాంధ్ర పబ్లిషింగ్ వారు ఈ పుస్తకాన్ని 2004 వ సంవత్సరం మేనెలలో పాఠకులకు అందించారు.మొదటి ముద్రణ 1000 పుస్తకములు. ముఖపత్ర చిత్రాన్ని చంద్ర (సాహిత్య ప్రస్థానం-సాహీతీ స్రవంతీ సౌజన్యంతో)గీసారు. పుస్తకంలోని అక్షరాలంకారాన్ని ట్వంటీఫస్ట్‌ సెంచరీ,దిల్‌సుఖ్‌నగర్‌ వారు చెయ్యగా,పుస్తకముద్రణ శ్రీ కళాంజళి గ్రాఫిక్స్,హిమాయత్‌నగర్లో జరిగింది.ఈ కథలసంపుటాన్ని రచయిత తన వియ్యంకుడు.కీర్తిశేషుడైన గోళ్లమూడి సుందరరామిరెడ్డి (1933-1991)కి అంకితమిచ్చాడు. పుస్తకం చివర-కథలు చదివిన తరువాత పాథకులతో పదినిమిషాలు- అంటూ వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు చక్కని పీఠిక అందించారు.

రచయిత గురించి

మార్చు

కేతు విశ్వనాథరెడ్ది ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు. బహుముఖప్రజ్ఞాశాలి. దాదాపు 1961 నుండి రచానావ్యాసంగంలో వున్నవాడు. ఈ పుస్తకం కన్నముందు జప్తు,కేతు విశ్వనాథరెడ్డి కథలు, ఇచ్ఛాగ్ని అనే మూడు కథలసంపుటాలు కూడా వెలువడ్డాయి.ఈ కథలతోపాటు వేర్లు ,బోధి అనే రెండు నవలికల్నికుడా వ్రాసాడు. తన కథలకు ముందుమాటలు అవసరం లేని రచయిత, కేతు విశ్వనాథరెడ్డిది మొదటి నుండి సాహిత్యవిమర్శ మీద, కల్పనా సాహిత్యం మీద శ్రద్డా, అసక్తి,పట్టు వున్న వ్యక్తి. తన సాహిత్య విమర్శావ్యాసాలలోకొన్నింటిని దృష్టి అన్న సంపుటంగా విడుదలచేసాడు.సాహిత్య పరిశోధనరంగం మీదకూడా ఈయన మౌలికమైన కృషిచేశాడు. ఎందరో విద్యార్థులచే కల్పనాసాహిత్యం మీద పరిశోధనలు చేయించాడు. తెలుగు భాషా సాహిత్యాల పాఠ్య ప్రణాళికల్ని చేరా గారితో కలసి రూపొందించారు. కొడవటిగంటి సాహిత్యాన్ని సంపాదించి ప్రచురించుటకు ఆయన చేసిన కృషి అపురూపం. ఈయనకు ఎన్నో వ్యాసాంగాలున్న ఆయనగారి ఆత్మ వ్యాసంగం మాత్రం-కథారచనే. కేతు విశ్వనాథరెడ్డి గారిపేరు వినగానే ఆయన కలంనుండి జాలువారిన నమ్ముకున్న నేల , కూలిన బురుజు, పీర్లచావడి,గడ్డి,దాపుడుకోక,జప్తువంటి ఎన్నో కథలు జ్ఞాపకానికొస్తాయి.కేతుగారు వుద్యోగరీత్యా నగరవాసి అయినప్పటికి,కడపజిల్లాను,పల్లెప్రజలను,మట్టివాసనను మరువలేదు.విశ్వనాథరెడ్ది గారు తనజీవితంలో భాగాలైన విశ్వవిద్యాలయాలగురించి, నగరాలగురించి అరుదుగా కొన్ని రచనలు చేసినప్పటికి వాటి మూలాలు రాయలసీమలోని పల్లెలను పలుకరిస్తాయి. రాయలసీమ ప్రజల జీవితాలకు సంబంధించిన ప్రత్యేకాంశలను సాధ్యమైనంత కళాత్మకంగా తన కథలలో చూపించడం రచయిత యొక్క ప్రత్యేకత.

పుస్తకంలోని కథలేమంటున్నాయి?

మార్చు

ఇందులో మొత్తం 12 కథలున్నాయి.1998-2003 మధ్యలో వివిధ పత్రికలలో ముద్రితమైనవి.

కథల వివరాల పట్టిక

కథ పేరు ప్రచురణ ప్రచురణ కాలం
ఒక వాల్మీకి సహకార సమాచారం అగస్టు 1998
పోలికలు ఈనాడు ఆదివారము 27 9998 సెప్టెంబరు 1
ముఖదర్శనం ఇండియాటుడే 6అక్టొబరు1998
స్వస్తి ఆదివారం ఆంధ్రజ్యోతి 11-10-98
మాయపొరలు ఇండియాటుడే వార్షిక సంచిక 2000
కాంక్ష రచన జులై2001
రెండుప్రపంచాల మధ్య తొలకరి జులై 2002
అమ్మవారినవ్వు ఇండియాటుడే 2003 జనవరి 28
దగ్గరైన దూరం,దూరమైన దగ్గర ఆదివారం ఆంధ్రజ్యోతి 2003 మార్చి 2
సంకట విమోచని ఆంధ్రప్రభ ఆదిత్య హృదయం,ఆదివారం ఏప్రిల్2003
పొడి నిజం ప్రస్థానం ఏప్రిల్-జూన్ 2003
విరూపం ప్రస్థానం సహిత్య ప్రత్యేక సంచిక 2002

ఈ కథాసంపుటములోని కథలన్ని కడపజిల్లా గ్రామీణ వాతావరణంతో ప్రత్యక్షంగానో,పరోక్షంగానో ముడివడి వున్నవే? సంబంధమున్నవే.ప్రవాసాంధ్రుల గురించివ్రాసిన రెండు ప్రపంచాల మధ్య ,దగ్గరైన దూరం-దూరమైన దగ్గర -కథలలో కథావస్తువుల ఫలితాలు-పరిణామాలు రాయలసీమ గ్రామజీవితాలతో ముడిపడివున్నవే.రాయలసీమలోని విభిన్నాంశాలను చిత్రించిన కథలు-స్వస్తి ,మాయపొరలు ,విరూపం,పొడినిజం.

  • వీటిలో స్వస్తి,భద్రతకు సంబంధించినకథ.రాజకీయనాయకులకు,ఫ్యాక్షనిస్టులకు అనుక్షణం కంటికిరెప్పలా కాచుకొనివుండే అంగరక్షకులు (గన్‌మెన్)ల వ్యక్తిగత రక్షణ గురించి వ్రాసినకథ.రాజకీయనాయకులక్,ఫ్తాక్షనిస్టుల ప్రాణాలకు గన్‌మెన్ల ప్రాణాలడ్దు.మరి!గన్‌మెన్ల ప్రాణాలకెవ్వరు అడ్దు? ప్రాణాలు పోతే వారికుటుంబాలకెవ్వరుదిక్కు!.తమ కుటుంబపోషణార్ధమై, ప్రాణాలను పణంగా బెట్టి బ్రతకవలసినదేనా?
  • మాయపొరలు హింస గురించి తార్కికంగా ఆలోచించేకథ.హింస అనేది మానవ స్వాభావంలోనే పుట్టుకతోనే వుందా?కులం,రాజకీయభావజాలం అసలు హింసకు కారణాలుకావని,అసలు కారణం ఆర్థికమేనని కుండబద్దలుకొట్టినట్లు తేల్చి చెప్పుతున్నది.
  • పొడినిజం-ఇది నీటి తడిని గురించినకథ.రెండు కథల ఆధారంగా రాయలసీమలోని నేటి దుస్థితిని తెలియచేసిన కథ.చక్కని లోతైన భావంవున్నకథ.శిల్పసామర్త్ధ్యంతో కథా వస్తువు విస్తృతి పెంచిన కథ.సీమలో పండేభూ ములున్నాయి.కాని భూములను తడిపే నీరే అందుబాటులో లేదు.సీమ కిప్పుడు ఒక అపరభగీరథుడు కావాలీ?
  • విరూపం-అనేలార్థలకథ్.అభివృద్ధి అంటే ఏమిటి?.ఇదే ఈ కథలోని ప్రధాన కథావస్తువు.రాయలసీమ లోని వ్యవసాయభూములు పరిశ్రమలకు ముడిసరుకుగా మారితే,వారిపొలాలలో పుట్తిన పరిశ్రమలలో రైతులు దిన కూలీలగా మారితే,తరువాత ఏర్పడే పరిణామలవిశ్లేషణ యే ఈ కథలోని మూలవస్తువు.
  • అమ్మవారినవ్వు-ఈ కథలో వర్ణించిన మతాతీతమైన చెలిమి ఒక్కటే ఈ దేశాన్ని పట్తి పీడిస్తున్న జాతి సమస్యకు పరిస్క్రారము.పువ్వులతో మొదలై,నవ్వులతో అంతమైన కథ.మంచి భావుకతా,నిర్మాణ చాతుర్యమున్న కథ.
  • ముఖదర్శనము-ఇది పాతకథా వస్తువు.భర్యపోయిన స్త్రీని వితంతువుగా చెయ్యడం,ఇందులోని కథాంశం.వితంతువుగా చెయ్యునప్పుడు,ఆమె పొందే మనసిక క్షోభ వర్ణాణాతీతమైనది,ఆటవీకమైనది.
  • వాల్మికీ-చిన్నకథ.రచయిత చెప్పదలచుకున్నది,పాఠకులకు అందలేదేమోననిపిస్తుంది కథ చదివాకా.