పరిశోధన
పరిశోధన అనగా తెలియని విషయాలను తెలుసుకునేందుకు శోధించడం. ఇది సమస్యలను పరిష్కరించే, వాస్తవాలను వ్యవస్థీకృత మార్గంలో కనుగొనే ప్రక్రియ. కొన్నిసార్లు సాధారణ జ్ఞానాన్ని సవాలు చేయడానికి లేదా సాధారణీకరించదగిన జ్ఞానానికి సహకారం అందించడానికి పరిశోధన ఉపయోగించబడుతుంది. పరిశోధనలో వాస్తవాలను రుజువు చేయుటకు కొన్ని క్రొత్త అల్గోరిథంలు, పద్ధతులను కనుగొనవలసి ఉంటుంది లేదా ఇవి ఇప్పటికే ఉన్న ఇతర పద్ధతులకు భిన్నంగా ప్రతిబింబించాలి. తెలిసిన వాటిని వర్తింపజేయడం ద్వారా ద్వారా పరిశోధన జరుగుతుంది. ఇప్పటికే ఉన్న సిద్ధాంతాలను రుజువు చేయడం ద్వారా, పరిశీలనలను బాగా వివరించడానికి ప్రయత్నించడం ద్వారా అదనపు జ్ఞానాన్ని కనుగొనవచ్చు. పరిశోధన అనేది క్రమ పద్ధతి, క్రమ పొందిక, విషయాత్మకలక్ష్యమును కలిగివుండాలి.[1] పరిశోధన అనేది కొత్త సిద్ధాంతాలను శాస్త్రీయ పద్ధతిగా అభివృద్ధి చేయడం. ప్రాథమిక పరిశోధన యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం ఆవిష్కరణ. శాస్త్రీయ పరిశోధన శాస్త్రీయ పద్ధతిని అనుసరించడంపై ఆధారపడుతుంది, ఇది ఉత్సుకతను పెంపొందిస్తుంది, ఫలితాల కోసం సన్నద్ధం చేస్తుంది. ఇటువంటి పరిశోధన ప్రకృతి సిద్ధాంతాల యొక్క శాస్త్రీయ సమాచారమును, వివరణను అందిస్తుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రాథమికాలను పరిచయం చేస్తుంది. ఇది ఆచరణాత్మక అమలులను సాధ్యం చేస్తుంది. శాస్త్రీయ పరిశోధనలకు ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంఘాలు వంటి అనేక సంస్థలు నిధులు సమకూరుస్తాయి.
"మనం ఏమి చేస్తున్నామో మనకు తెలిస్తే, దానిని పరిశోధన అని పిలవరు, అవునా?" - ఆల్బర్ట్ ఐన్‌స్టీన్[2]
శాస్త్రీయ పరిశోధనను వివిధ మార్గాల్లో విభజించవచ్చు.
- వ్యవసాయరంగానికి సంబంధించి నూతన వంగడాలను (విత్తనాలు, మొక్కలు) కనుగొనే సంస్థను వ్యవసాయ పరిశోధన సంస్థ అంటారు. ఉదాహరణకు ఇక్రిశాట్ అనే వ్యవసాయ పరిశోధన సంస్థ అధిక దిగుబడినిచ్చే అనేక వంగడాలను కనుగొన్నది.
- వైద్య రంగానికి సంబంధించి నూతన మందులను కనుగొనే సంస్థను వైద్య పరిశోధన సంస్థ అంటారు. వైరస్ ల వ్యాప్తి నిరోధమునకు అవసరమైన మందులను, టీకాలను కొత్తగా తయారు చేయడానికి వైద్య పరిశోధన సంస్థలు పరిశోధనలు చేస్తాయి.
- అంతరిక్ష పరిశోధన సంస్థలు అంతరిక్షం గురించి పరిశోధిస్తాయి. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ.
మూలాలు
మార్చు- ↑ Bung, Mario 1967. Scientific research. vol 1: The search for system; vol 2: The search for truth. Berlin:Springer.
- ↑ "How to: Begin Basic Academic Research". OnlineUniversities.com. Retrieved 4 October 2016.[permanent dead link]