కేదార్ హజ్రా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జామువా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

మార్చు

కేదార్ హజ్రా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో జామువా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి చంద్రికా మహతాపై 5,134 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి మూడోస్థానంలో నిలిచాడు.

కేదార్ హజ్రా 2014 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో జామువా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) అభ్యర్థి సత్య నారాయణ దాస్ పై 23,100 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి, 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మంజు కుమారిపై 18,175 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (18 October 2024). "అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయేకు గట్టి దెబ్బ". Retrieved 18 October 2024.
  2. The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.
  3. The Avenue Mail (18 October 2024). "Jharkhand Election: Jolt to NDA as Ajsu, BJP leaders join JMM". Retrieved 18 October 2024.
  4. India TV News (18 October 2024). "Jharkhand Election 2024: AJSU's Umakant Rajak, BJP leader Kedar Hazra join JMM in big jolt to NDA" (in ఇంగ్లీష్). Retrieved 18 October 2024.