కేలాంగ్

హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం

కేలాంగ్ హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం, లాహౌల్ స్పితి జిల్లా ముఖ్య పట్టణం. ఇది మనాలి-లేహ్ హైవే పై సముద్రమట్టం నుండి 3098 మీటర్ల ఎత్తున ఉంది. మనాలికి ఉత్తరాన రోహ్‌తాంగ్ సొరంగం గుండా వెళ్తే 71 కి.మీ. దూరంలోను, భారత-టిబెట్ సరిహద్దు నుండి 125 కి.మీ. దూరం లోనూ ఉంది.

కేలాంగ్
పట్టణం
కర్దాంగ్ బౌద్ధ మఠం నుండి కేలాంగ్ దృశ్యం
కర్దాంగ్ బౌద్ధ మఠం నుండి కేలాంగ్ దృశ్యం
కేలాంగ్ is located in Himachal Pradesh
కేలాంగ్
కేలాంగ్
Coordinates: 32°35′N 77°02′E / 32.58°N 77.03°E / 32.58; 77.03
దేశంభారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాలాహౌల్ స్పితి
Elevation
3,080 మీ (10,100 అ.)
జనాభా
 • Total2,000 (2,020 est)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)

దర్శనీయ స్థలాలు, పండుగలు

మార్చు

టిబెటన్ బౌద్ధమత ద్రుక్పా శాఖకు చెందిన అతిపెద్ద, అతి ముఖ్యమైన మఠం, కర్దాంగ్ మఠం కీలాంగ్‌లో ఉంది. ఇది కీలాంగ్ నుండి భాగా నదికి అవతలి గట్టున ఉంది.

కేలాంగ్ సమీపంలో ఉన్న ప్రదేశాల్లో కర్దాంగ్, షసూర్, తాయూల్ మఠాలు ఉన్నాయి, ఇవన్నీ కేలాంగ్ నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. శ్రీ నవాంగ్ దోర్జే ఇంట్లో స్థానిక దేవత కేలాంగ్ వజీర్ ఆలయం కూడా ఉంది.

ఇక్కడ ఏటా జూలైలో లాహాల్ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్ద మార్కెట్, అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతాయి. [1]

పర్యాటకం

మార్చు

కేలాంగ్, లాహౌల్ స్పితి జిల్లా ముఖ్య పట్టణం. లాహౌల్ లోని చాలా ప్రభుత్వ కార్యాలయాలు, సౌకర్యాలకు నిలయం.

సర్క్యూట్ హౌస్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) రెస్ట్ హౌస్, సైనిక విశ్రాంతి గృహం, టూరిస్ట్ బంగ్లా, అనేక చిన్న హోటళ్ళతో సహా అనేక పర్యాటక సౌకర్యాలు పట్టణంలో ఉన్నాయి. [2]

రవాణా

మార్చు

మనాలి నుండి ఎన్‌హెచ్ 21 లో భాగమైన మనాలి-లే హైవే ద్వారా కేలాంగ్‌ చేరుకోవచ్చు. ఇది మనాలి నుండి ఉత్తరాన 71 కి.మీ. దూరంలో ఉంది. రోహ్తాంగ్ కనుమ వద్ద భారీ హిమపాతం కారణంగా అక్టోబరు చివరి నుండి మే మధ్య వరకు ఈ దారిని మూసేస్తారు. 2019-20 వరకు ఇలాగే జరిగింది. అయితే, 2020 అక్టోబరులో అటల్ సొరంగాన్ని తెరిచిన తరువాత, దాదాపు సంవత్సరం పొడుగునా కేలాంగ్ వెళ్ళే వీలు కలిగింది. మే, జూన్ నెలల్లో చాలా మంది పర్యాటకులు రోహ్తాంగ్ కనుమను సందర్శిస్తారు. మనాలి నుండి వేసవి కాలంలో బస్సులు కూడా తిరుగుతాయి.

వాతావరణం

మార్చు
శీతోష్ణస్థితి డేటా - Kyelang (1961–1990, rainfall 1951–2000)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 13.1
(55.6)
9.0
(48.2)
16.7
(62.1)
18.7
(65.7)
25.9
(78.6)
27.7
(81.9)
28.7
(83.7)
28.2
(82.8)
27.1
(80.8)
22.9
(73.2)
20.2
(68.4)
13.9
(57.0)
28.7
(83.7)
సగటు అధిక °C (°F) 6.7
(44.1)
6.0
(42.8)
9.8
(49.6)
14.8
(58.6)
22.1
(71.8)
25.9
(78.6)
26.8
(80.2)
26.7
(80.1)
25.6
(78.1)
21.8
(71.2)
16.3
(61.3)
12.1
(53.8)
17.9
(64.2)
సగటు అల్ప °C (°F) −16.5
(2.3)
−17.7
(0.1)
−13.8
(7.2)
−7.4
(18.7)
−0.9
(30.4)
2.9
(37.2)
5.3
(41.5)
6.7
(44.1)
1.3
(34.3)
−4.1
(24.6)
−7.7
(18.1)
−14.1
(6.6)
−5.5
(22.1)
అత్యల్ప రికార్డు °C (°F) −19.4
(−2.9)
−19.7
(−3.5)
−16.1
(3.0)
−13.6
(7.5)
−1.9
(28.6)
−0.2
(31.6)
1.7
(35.1)
4.6
(40.3)
−0.1
(31.8)
−8.9
(16.0)
−10.4
(13.3)
−17.5
(0.5)
−19.7
(−3.5)
సగటు వర్షపాతం mm (inches) 78.0
(3.07)
92.8
(3.65)
141.1
(5.56)
88.2
(3.47)
71.1
(2.80)
25.8
(1.02)
60.3
(2.37)
42.1
(1.66)
55.5
(2.19)
24.4
(0.96)
25.8
(1.02)
35.3
(1.39)
740.4
(29.16)
సగటు వర్షపాతపు రోజులు (≥ 2.5 mm) 6.3 5.9 8.7 6.5 5.4 2.2 5.6 4.3 3.5 2.0 1.6 3.1 55.1
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 74 76 75 66 62 62 74 77 64 52 54 67 67
Source: India Meteorological Department[3]

మూలాలు

మార్చు
  1. [1]
  2. [2]
  3. "Climate of Himachal Pradesh" (PDF). Climatological Summaries of States Series - No. 15. India Meteorological Department. January 2010. pp. 65–68. Archived from the original (PDF) on 20 February 2020. Retrieved 8 March 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=కేలాంగ్&oldid=3122178" నుండి వెలికితీశారు