హిమాచల్ ప్రదేశ్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
హిమాచల్ ప్రదేశ్ (हिमाचल प्रदेश) వాయువ్య భారతదేశం లోని ఒక రాష్ట్రం. రాష్ట్రానికి తూర్పున టిబెట్ (చైనా), ఉత్తరాన, వాయువ్యాన జమ్మూ కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఆగ్నేయాన ఉత్తరాఖండ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ విస్తీర్ణం 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు), 1991 జనాభా ప్రకారం రాష్ట్రం జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభాగంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర రాజధాని సిమ్లా. ధర్మశాల, కాంగ్రా, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ, మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రంలో చాలా ప్రాంతం పర్వతమయం. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఘగ్గర్-హక్రా నది జన్మస్థలం. రాష్ట్రంలోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉంది), బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.
Himachal Pradesh | |
---|---|
Etymology: "Land of the snow-clad mountains" | |
Nickname: "Mountain State" | |
Motto(s): Satyameva Jayate (Truth alone triumphs) | |
Coordinates: 31°6′12″N 77°10′20″E / 31.10333°N 77.17222°E | |
Country | India |
Region | North India |
As Union territory | 1 November 1956 |
Formation (as a state) | 25 January 1971 |
Capital | Shimla Dharamshala (Winter) |
Largest City | Shimla |
Districts | 12 |
Government | |
• Body | Government of Himachal Pradesh |
• Governor | Shiv Pratap Shukla[1] |
• Chief Minister | Sukhvinder Singh Sukhu (INC) |
State Legislature | Unicameral |
• Assembly | Himachal Pradesh Legislative Assembly[2] (68 seats) |
National Parliament | Parliament of India |
• Rajya Sabha | 3 seats |
• Lok Sabha | 4 seats |
High Court | Himachal Pradesh High Court |
విస్తీర్ణం | |
• Total | 55,673 కి.మీ2 (21,495 చ. మై) |
• Rank | 18th |
Dimensions | |
• Length | 150 కి.మీ (90 మై.) |
• Width | 300 కి.మీ (200 మై.) |
Elevation | 350 మీ (1,150 అ.) |
Highest elevation | 6,813 మీ (22,352 అ.) |
Lowest elevation | 232 మీ (761 అ.) |
జనాభా (2011) | |
• Total | 68,64,602 |
• Rank | 21st |
• జనసాంద్రత | 123/కి.మీ2 (320/చ. మై.) |
• Urban | 10.03% |
• Rural | 89.97% |
Demonym | Himachalis |
Language | |
• Official | Hindi |
• Additional Official | Sanskrit |
• Official Script | Devanagari script |
GDP | |
• Total (2019-2020) | ₹1.62 లక్ష కోట్లు (US$20 billion) |
• Rank | 22nd |
• Per capita | ₹1,83,333 (US$2,300) (14th) |
Time zone | UTC+05:30 (IST) |
ISO 3166 code | IN-HP |
Vehicle registration | HP |
HDI (2019) | 0.725 High [5] (8th) |
Literacy (2011) | 86.06%[6] (10th) |
Sex ratio (2011) | 972♀/1000 ♂ (32th) |
Symbols of Himachal Pradesh | |
దస్త్రం:Himachal Pradesh seal.svg | |
Language | Hindi |
Bird | Western tragopan |
Fish | Golden Mahseer[7] |
Flower | Pink rhododendron |
Mammal | Snow leopard |
Tree | Deodar cedar |
State Highway Mark | |
State Highway of Himachal Pradesh HP SH1 - HP SH43 | |
List of State Symbols |
రాష్ట్రం లోని జిల్లాలు
మార్చుసంస్కృతి
మార్చుకాంగ్రి, పహారీ, పంజాబీ, హిందీ, మండియాలీ ఈ రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భాషలు. హిందూ, బౌద్ధ, సిక్కు రాష్ట్రంలోని ప్రధాన మతాలు. రాష్ట్రంలోని పశ్చిమ భాగంలోని ధర్మశాల, దలైలామా, అనేక టిబెట్ శరణార్ధులకు ఆవాసం.
రాజకీయాలు
మార్చు2003 రాష్ట్ర శాసనసభలో భారత జాతీయ కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షం.
రవాణా, సమాచార ప్రసరణ
మార్చురోడ్లు ప్రధాన రవాణా మార్గాలు. రోడ్లు కురుచగా మెలికలు తిర్గుతూ తరచూ ఊచకోతలు, భూమి జారడాల మధ్య ఉండటం వలన ప్రయాణం చాలా మెల్లగా సాగుతుంది. ఋతుపవనాల కాలంలో పరిస్థితి మరింత భయానకంగా ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న హిమాచల్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ రాష్ట్రమంతటా బస్సులు నడుపుతుంది. దాదాపు అన్ని ప్రాంతాలకు టెలిఫోన్, మొబైల్ ఫోన్ సౌకర్యాలు ఉన్నాయి.
పర్యాటక ప్రాంతాలు
మార్చుఇవి కూడా చూడండి
మార్చు- హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు
- బాబా కాన్సీరామ్ - ఇతను భారతీయ కవి, భారత స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త.
- బి. రాచయ్య
- చౌక్ పూరణ (జానపద కళ)
మూలాలు
మార్చు- ↑ "New Himachal governor Rajendra Arlekar is 1st Goan to occupy the post | Latest News India - Hindustan Times". 6 July 2021.
- ↑ "Himachal Pradesh Vidhan Sabha". Hpvidhansabha.nic.in. 18 ఏప్రిల్ 2011. Archived from the original on 20 జూలై 2011. Retrieved 15 జూన్ 2011.
- ↑ Statistical Facts about India, indianmirror.com, archived from the original on 26 అక్టోబరు 2006, retrieved 26 అక్టోబరు 2006
- ↑ "Mountaineering & Rock Climbing - Himachal Tourism Official Website".
- ↑ "Sub-national HDI – Area Database". Global Data Lab. Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
- ↑ Office of the Registrar General & Census Commissioner, India, Ministry of Home Affairs, "6. State of Literacy" (PDF), 2011 Census of India - Results, Government of India, archived (PDF) from the original on 6 July 2015, retrieved 13 February 2022,
[Statement 22(a)] Effective literacy rates – persons: 74.04%; males: 82.14%; females: 65.46%
- ↑ ICAR-National Bureau of Fish Genetic Resources (ICAR-NBFGR), State Fishes of India (PDF), Lucknow, Uttar Pradesh: Indian Council of Agricultural Research (ICAR)
బయటి లింకులు
మార్చు- వర్మ, వి. 1996. గద్దీస్ ఆఫ్ ధౌళాధర్: ఏ ట్రాన్స్ హ్యూమన్ ట్రైబ్ ఆఫ్ ద హిమాలయాస్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ.
- హందా, ఓ. సీ. 1987. బుద్ధిష్ట్ మొనాస్టరీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ. ISBN 81-85182-03-5.