కేహర్ సింగ్ రావత్

కేహర్ సింగ్ రావత్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో హతిన్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

కేహర్ సింగ్ రావత్

పదవీ కాలం
2014 – 2019
ముందు జలేబ్ ఖాన్
తరువాత ప్రవీణ్ దాగర్
నియోజకవర్గం హతిన్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు ఐఎన్ఎల్‌డీ, భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

కేహర్ సింగ్ రావత్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో హతిన్ నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2014 ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హర్ష కుమార్‌పై 6,372 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

కేహర్ సింగ్ రావత్ ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందు మార్చిలో భారతీయ జనతా పార్టీ చేరాడు.[1][2] ఆయనకు 2024 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని బిజెపి ఆరేళ్ల పాటు బహిష్కరించింది,[3] ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. The Times of India (26 March 2019). "INLD loses yet another legislator to saffron party". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  2. Zee News (25 March 2019). "Lok Sabha election 2019: Paralympian Deepa Malik, Kehar Singh Rawat join BJP" (in ఇంగ్లీష్). Retrieved 8 November 2024.
  3. India Today (29 September 2024). "BJP expels 8 Haryana leaders for six years over choosing to contest independently" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  4. Hindustantimes (8 October 2024). "Haryana Assembly poll results: Most BJP rebels, who fought as independents, lose". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Hathin". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.