కొండగావ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండగావ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది బస్తర్ డివిజన్‌లో మూడవ అతిపెద్ద నగరం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. కొండగావ్, జగదల్పూర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2012 జనవరి 24 న బస్తర్ జిల్లా నుండి విడిపోయి కొండగావ్ జిల్లా ఏర్పడినపుడు కొండగావ్, ఆ జిల్లాకు ముఖ్యపట్టణమైంది. బెల్ మెటల్‌తో చేసే కళారూపాలకు, ఇతర బస్తర్ గిరిజన కళా రూపాలకూ పట్టణం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వివిధ రకాల దేశీయ హస్తకళాకృతుల కారణంగా ఈ పట్టణాన్ని శిల్ప్ షెహెర్ (శిల్ప నగరం) అని కూడా పిలుస్తారు.

కొండగావ్
పట్టణం
Nickname: 
శిల్ప నగరం
కొండగావ్ is located in Chhattisgarh
కొండగావ్
కొండగావ్
Coordinates: 19°36′N 81°40′E / 19.6°N 81.67°E / 19.6; 81.67
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
[[జిల్లా]కొండగావ్
 • Rankబస్తర్ డివిజనులో 3 వ స్థానం
Elevation
593 మీ (1,946 అ.)
జనాభా
 (2011)
 • Total40,921
భాషలు
 • అధికారికహిందీ, హల్బీ
Time zoneUTC+5:30 (IST)
PIN
494226
Vehicle registrationCG-27
Websitehttp://kondagaon.gov.in/

భౌగోళికం, జనాభా

మార్చు

కొండగావ్ 19°36′N 81°40′E / 19.6°N 81.67°E / 19.6; 81.67 వద్ద, [1] సముద్రమట్టం నుండి సగటున 593మీటర్ల ఎత్తున ఉంది.

2011 జనగణన ప్రకారం,[2] కొండగావ్ జనాభా 40,921. జనాభాలో పురుషులు 50%, మహిళలు 50% ఉన్నారు. కొండగావ్ సగటు అక్షరాస్యత 64%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 73%, స్త్రీల అక్షరాస్యత 55%. కొండగావ్‌ జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

రవాణా సౌకర్యాలు

మార్చు

కొండగావ్ జాతీయ రహదారి 30 పై ఉంది. రాయపూర్ లేదా జగదల్పూర్ నుండి కొండగావ్‌కు తరచుగా బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. సమీప రైల్వే స్టేషను జగదల్‌పూర్. పట్టణం లోని ప్రభుత్వ కళాశాల ఆవరణకు పక్కనే ఉన్న ఆట స్థలంలో హెలికాప్టరు దిగడానికి ఒక స్థలాన్ని తాత్కాలికంగా నిర్మించారు.

ఇతర విశేషాలు

మార్చు

బెల్ మెటల్‌తో తయారు చేసే కళాకృతులకు ఈ పట్తణం ప్రసిద్ధి. దాదాపు అంతరించిపోయిన మైనపు శిల్పకళ యొక్క రూపం ఇది. బెల్-మెటల్ కళారూపాలలో ప్రముఖ కళాకారులు దివంగత డాక్టర్ జైదేవ్ బాఘెల్ (జాతీయ అవార్డు గ్రహీత), సుశీల్ సఖుజా, సుక్ చంద్, సురేష్ బాగ్మారే మొదలైనవారు.

మూలాలు

మార్చు
  1. Falling Rain Genomics, Inc - Kondagaon
  2. "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

 

"https://te.wikipedia.org/w/index.php?title=కొండగావ్&oldid=3849917" నుండి వెలికితీశారు