కొండపల్లి బొమ్మలు

పిల్లల ఆటబొమ్మలు

కొండపల్లి బొమ్మలు లేదా కొండపల్లి కొయ్యబొమ్మలు  విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామంలో తయారైన బొమ్మలు.[1][2] మకర సంక్రాంతిదసరా పండుగల సమయంలో సంప్రదాయికంగా వీటితో స్త్రీలు బొమ్మల కొలువు ఏర్పాటుచేస్తూంటారు.[3]

PGI-Logo.svg.png ఈ వ్యాసం
భౌగోళిక గుర్తింపు (GI)
జాబితాలో భాగం

కొండపల్లి బొమ్మలు
Kondapalli toys at a house in Vijayawada.jpg
విజయవాడలోని ఓ ఇంట్లో కొండపల్లి బొమ్మలు
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
ప్రాంతంకొండపల్లి
లభ్యత16వ శతాబ్దం నుండి–
పదార్థాలుపొణికి చెక్క


భౌగోళిక గుర్తింపు భౌగోళిక గుర్తింపు

చరిత్రసవరించు

రాజస్థాన్ నుంచి తరతరాల క్రితం వలసవచ్చిన నిపుణులు ఈ బొమ్మలు రూపొందిస్తూంటారు. ఈ బొమ్మలు రూపొందించే నిపుణుల్ని ‘ఆర్యక్షత్రియులు’గా పిలుస్తూంటారు. వలస వస్తూ ఈ కళాకారులు 16వ శతాబ్దంలో తమతో పాటుగా బొమ్మలు తయారుచేసే కళను తీసుకువచ్చినట్టు చెప్తూంటారు. ఈ నాలుగువందల ఏళ్ళ సంప్రదాయం తరం  నుంచి తరానికి అందుతూ వచ్చింది. ఆ క్రమమంలో  కొండపల్లిలోని  బొమ్మల  కాలనీలో కుటుంబంలోని  ప్రతివారూ బొమ్మల రూపొందించడంలో పాలుపంచుకుంటున్నారు. ఈ సముదాయం గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది. ఈ సముదాయం  శివుడి నుంచి కళలు, నైపుణ్యం పొందిన ముక్తాఋషి తమకు ఆద్యుడని పేర్కొంటూంటారు.  ఈ నిపుణులు ఆంధ్రప్రదేశ్  లోని అనేక ఆలయాల్లో గరుడుడు,  నంది,  సింహం,  వాహనాలు  వంటివాటి విగ్రహాలను  తమ పూర్వీకులు  చెక్కినట్టుగా చెప్తారు. కాలక్రమేణా  కొండపల్లి  కొయ్యబొమ్మలు ఆటబొమ్మల నుంచి సేకరణ వస్తువులయ్యాయి. విపణిలో మార్పుకు ఇది కారణమైంది, ఎందుకంటే పిల్లల బొమ్మలు పాడవగలిగేవి  మళ్ళీ మళ్ళీ కొనేవి  కాగా సేకరణ వస్తువులు  ఒకసారి కొన్నాకా భర్తీ చేయాల్సిన అవసరం తక్కువ ఉంటుంది. దసరాసంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు, దానిలో ఈ కొయ్యబొమ్మలు అంతర్భాగం. వేడుకగా స్త్రీలు తాము  సేకరించిన వివిధ కొయ్యబొమ్మల్ని ప్రదర్శిస్తారు. వేడుకలో స్త్రీలు, పిల్లలు ఆసక్తిగా పాల్గొంటూంటారు. ఈ పండుగల సమయంలో కొండపల్లి  బొమ్మల నిపుణులు ప్రధానంగా తమ వ్యాపారం  చేస్తున్నారు. ఐతే  ఈ సంప్రదాయాలు క్రమంగా  కళ తప్పుతూండడంతో నిపుణులు గిట్టుబాటు కోసం సహజమైన రంగులను వదిలి ఎనామెల్ రంగులు వంటివాటిని వినియోగిస్తున్నారు. బొమ్మల వ్యాపారంలో యంత్రాల వినియోగం వంటివి వచ్చి చేరి కొండపల్లి నిపుణుల వ్యాపారం దెబ్బతీస్తున్నా ప్రస్తుతం ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ సంస్థలు దృష్టిపెడుతున్న కారణంగా వీరికి సహకారంగా ఉంది.

 
హైదరాబాద్ లోని శిల్పారామంలో కొయ్య బొమ్మల నమూనాలు

బొమ్మలుసవరించు

తెల్ల పొణికి అని పిలిచే స్థానిక చెక్క రకం వాడి చెక్కి, ఆపై కూరగాయల నుంచి లభించే రంగులను, సహజ రంగులను, ప్రస్తుతం కొంతవరకూ ఎనామిల్ రంగులను వాడి తయారుచేసే ఈ బొమ్మలు కళాత్మకమైన పనితనానికి ప్రాచుర్యం పొందాయి. సంప్రదాయకమైన కొండపల్లి శైలిలోని తాడిచెట్టు బొమ్మలు, ఎడ్లబండి బొమ్మలు, అంబారీ ఏనుగు బొమ్మలు, గ్రామ నేపథ్యంలోని బొమ్మలు, బృందావన బొమ్మలు వంటివి చేస్తూంటారు.

అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మల్లో దశావతారాలు, ఏనుగు అంబారీ, ఒంటెద్దు బండి, గీతోపదేశం, పెళ్ళికూతురు-పెళ్ళికొడుకులను మోస్తూ వెళ్తున్న పల్లకీ-బోయీలు, గ్రామాల్లోని చేతివృత్తుల వాళ్ళ సెట్, జంతువులు వంటివి ఉన్నాయి. తల ఊపుతూండే అమ్మాయి, అబ్బాయి, బ్రాహ్మణుడు వంటివి చాలామందికి ఇష్టమైన కొండపల్లి బొమ్మలు.

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు