కొండేపూడి సుబ్బారావు

తెలుగు రచయిత, సంపాదకుడు

కొండేపూడి సుబ్బారావు (1916-2011) సాహిత్యంలో సంప్రదాయవాది. ఆంధ్ర పద్యకవితా సదస్సు అనే సాహిత్య సంస్థను స్థాపించి పద్య కవులకు ప్రోత్సాహమిచ్చాడు. విశాఖపట్టణంలో జీవించాడు. బి.ఎ., బి.ఇడి చదివాడు. డిఫెన్స్ అకౌంట్స్ శాఖలో ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశాడు. ప్రసన్న భారతి అనే సాహిత్య మాసపత్రికను స్థాపించి సంపాదకత్వం నెరపాడు. 96 సంవత్సరాలు జీవించి 2011, జనవరి 26న మరణించాడు.

రచనలు మార్చు

 1. ఈశ్వరార్పణము (పద్య కావ్యం)
 2. హనుమత్ ప్రబంధము (పద్య కావ్యం)
 3. గీతాసారము (పద్య కావ్యం)
 4. ప్రసన్నభారతి (పద్య కావ్యం)
 5. శ్రీమద్భాగవతము (ద్విపద కావ్యం)
 6. శ్రీ వేంకటేశ్వర కర్ణామృతము
 7. శ్రీ సూర్యస్తోత్రము
 8. సర్వేశ్వరస్తవము
 9. కవితామందాకిని (పద్య కావ్యం)
 10. గీతామృతము[1] (వచనానువాదం)
 11. శ్రీగీతా సంగ్రహము
 12. మహాభారత ధర్మశాస్త్రము[2] (వచనానువాదం)
 13. దేవీ భాగవతం (వచనానువాదం)
 14. సౌందర్య లహరి (వచనానువాదం)
 15. ముకుందమాల (వచనానువాదం)
 16. ఆఫీసర్[3] (కథాసాహిత్యం)

మూలాలు మార్చు