కొక్కెము (ఆంగ్లం Hook) బహుళ ప్రయోజనములు కలిగిన వస్తువు. కొన్ని పరాన్నజీవుల శరీరంలోని చిన్న కొక్కేలు (Hooklets) అతిధేయిని అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి.

రకాలుసవరించు

 
గాలం నిర్మాణం

కొక్కెములలో పనిని బట్టి చాలా రకాలున్నాయి.

  • సాధారణ కొక్కెము (Hanging hook) ఇంటిలో వివిధ వస్తువులను అందుబాటులో ఉంచుకోవడానికి ఉపయోగించే కొక్కెము. దీనిని గోడకు, అల్మరా, వంటగది, బాత్రూం మొదలైన ప్రదేశాలలో దుస్తులు, తాళం గుత్తులు, సంచులు, వంటసామాన్లు వేలాడదీస్తారు. ఇవి ఒకటి లేదా కొన్ని కొక్కెములు వరుసగా కూడా ఉపయోగిస్తారు.
  • చేపల కొక్కెము (Fish hook) చేపలను పట్టుకోవడానికి ఉపయోగించేది. దీనినే గాలం అని కూడా అంటారు. వీటిని కొన్ని శతాబ్దాల నుండి జాలరి వారు మంచినీరు, ఉప్పునీరున్న ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారు. మానవ చరిత్రలో చేపల కొక్కెము ఫోర్బిస్ ఎన్నికచేసిన 20 పనిముట్లలో ఒకటి.[1] దీనికున్న కన్నులోపల నుండి దారం చేపలను పట్టే వ్యక్తి పట్టుకుంటాడు. ఈ కొక్కెములలో చాలా రకాలు, పరిమాణాలు, డిజైన్లు, ఆకారాలలో ఉన్నాయి. వీటిని ముఖ్యంగా ఎరను పట్టుకోవడానికి, తినడానికి వచ్చిన చేప నోటి లోపలికి సుదిగానున్న గాలం దిగిపోయి దానిని కదలకుండా చేస్తుంది.
 
A lifting hook with a safety latch.
  • బరువులెత్తే కొక్కెము (Lifting hook) క్రేనులు మొదలైన భారీ యంత్రపరికరాలలో బరువుల్ని ఎత్తడానికి ఉపయోగించే అతి దృఢమైన లోహపు కొక్కెము. ఇలాంటి వానికి జారిపోకుండా సురక్షితంగా లాక్ చేయబడివుంటాయి. కొన్ని యంత్రాలలో సుళువుగా ఎత్తడానికి కప్పీలు కూడా కలిపి ఉపయోగిస్తారు.
  • వస్త్రాల కొక్కెము (Hook-and-eye closure) స్త్రీ పురుషుల వస్త్రధారణలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. భారత స్త్రీల రవికెలకు, బ్రాలకు కొక్కెములు ఇంకా ఉపయోగిస్తున్నారు. పురుషుల పంట్లాముకు పైభాగంలో కూడా కొక్కెం ఉంచుతారు. ఇవి జిప్ కన్నా అధిక బలాన్ని తట్టుకుంటాయి, తొందరగా పాడవవు. ఇలాంటి సందర్భాలలో కొక్కెంతో కలిపి పట్టుకోవడానికి లూప్ (కన్ను) కూడా కావాలి. ఈ కొక్కేలు టైలరింగ్ లో కొన్నిసార్లు వరుసగా ఏర్పాటుచేస్తారు.
  • తలుపుల కొక్కెము (Window or Door latch) తలుపులు, కిటికీలు మూయడానికి వాడే ఒక విధమైన పద్ధతి. దీనిలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉపరితలాల్ని లేదా వస్తువులను వేరుచేసే విధంగా కలపుతారు. ఇది కూడా ఒక తాళం వేసే విధానం, కానీ అంత సురక్షితమైనది కాదు. దీనిలో కొక్కెము మరొక లోహపు భాగం లోపల కూర్చుంటుంది. ఇవి ఎక్కువగా లోహాలతో తయారైవుంటాయి.
 
Latch

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొక్కెము&oldid=2879728" నుండి వెలికితీశారు