రవికె లేదాచోలీ (తమిళం: ரவிகே, కన్నడ: ರವಿಕೆ, హిందీ: चोली, మరాఠీ: चोळी, ఆంగ్లం: Blouse లేదా జాకెట్టు ) భారతదేశంలో స్త్రీలు శరీరం పై భాగాన్ని అనగా వక్ష స్థలమును కప్పుకోవడానికి వారికి తగిన విధముగా వస్త్రముతో కుట్టబడి ఉపయోగించేది. దక్షిణ నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్,, చీరలు ధరించే ఇతర ప్రదేశాలలో ధరిస్తారు. దీని మీద చీర యొక్క పైట భాగం కప్పుతుంది. ఆధునిక కాలంలో దీనిలోపల బ్రా కూడా ధరిస్తున్నారు. భారతదేశంలో ధరించబడే గాగ్రా ఛోళీలో కూడా ఇది ఒక భాగము. శరీరానికి హత్తుకునేంత బిగుతుగా చిన్న చేతులతోలో నెక్ తో చోళీని రూపొందిస్తారు. వక్ష స్థలము క్రింద నుండి నాభి వరకు బహిర్గతం అయ్యేలా కత్తిరించబడటం వలన దక్షిణాసియా వేసవులలో సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి దక్షిణాసియా దేశాలలో స్త్రీలు ప్రధానంగా ధరించే పై వస్త్రాలు.

రవికను ధరించిన స్తీ

వ్యుత్పత్తి

మార్చు

దక్షిణ భారతాన్ని పాలించిన ఛోళుల సామ్రాజ్యం నుండి ఛోళీ వ్యుత్పత్తి అయినది. పదవ శతాబ్దంలో కల్హణచే రచించబడ్డ రాజతరంగిణిలో దక్కనుకు చెందిన ఛోళీని పరిచయం చేసిన కాశ్మీరీ ప్రభుత్వ ఉత్తర్వు గలదు. మొట్టమొదటి ఛోళీలు వక్షోజాలకి మాత్రమే ఆచ్ఛాదననిచ్చి వీపు వైపున కట్టుకోవటానికి నాలుగు త్రాడులు కలిగి ఉండేవి. ఈ తరహా ఛోళీలు రాజస్థాన్లో ఇంకనూ సాధారణంగా వాడుతూ ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన అతి పురాతన చిత్రాలు ఛోళీ లకు మొట్టమొదటి ఉదాహరణలు. తమిళ కావ్యం శిలప్పదిక్కారం 3-4 శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఒకే వస్త్రమే చీరగా,, వక్షస్థలాచ్ఛాదనగా ఉపయోగపడేదన్న సంకేతాలనిస్తుంది. రాజా రవివర్మ వేసిన చిత్రాలలో స్త్రీలకు వక్షస్థలాచ్ఛాదన లేదు. ఇదిలా ఉంటే ఇంకో వైపు చరిత్రకారులు వివిధ రకాల వక్షస్థలాచ్ఛాదనలు అది వరకే ఉన్నవని వాదిస్తారు.

చిత్ర మాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

ఆంధ్రుల దుస్తులు

"https://te.wikipedia.org/w/index.php?title=రవికె&oldid=3064985" నుండి వెలికితీశారు