కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు
కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు (1871 నవంబరు 11 - 1919) తెలుగు రచయిత.[1]
జీవిత విశేషాలు
మార్చుఅతను ఆరువేలనియోగులు. అతను గోదావరి మండలంలోని పోలవరం గ్రామంలో 1871 నవంబరు 11 న జన్మించాడు. అతని దత్తత గొన్న తల్లిదండ్రులు వేంకట జగన్నాథరావు, కామాయమ్మ దంపతులు. అతను 1897లో రాజమండ్రి కళాశాలలో బి.ఎ చదివాడు. అతను పోలవరం జమీందారుగా ఉండేవాడు. 1900 నుండి ఎస్టేట్ వ్యవహారాలలో చేరాడు. అతను ఉత్తర సర్కార్ల జమీందార్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సభ్యునిగా పనిచేసాడు. అతను భారతదేశం అంతటా పర్యటించాడు. 1895 లో తెలుగు సాహిత్యం పునరుజ్జీవం కోసం ఆంధ్రభాషోజీవని సొసైటీని ప్రారంభించాడు. 1898 లో “జరస్వతి” అనే తెలుగు పత్రికను ప్రారంభించాడు. పోలవరం వద్ద ఒక ఆసుపత్రి, కోతపల్లి వద్ద ఒక చౌల్ట్రీని స్థాపించాడు. రాజమండ్రిలో వితంతు గృహాన్ని ఉదారంగా యిచ్చాడు. [2]
గ్రంథాలు
మార్చు- 1. రాజతరంగిణి (కల్హణుని కాశ్మీర దేశప్రభుల చరిత్రమునకు దెలుగు వచనము)
- 2. అపవాద తరంగిణి (షెడిడనుకవి రచించిన స్కూల్ ఆఫ్ స్కాండల్ అను నాంగ్ల నాటకమునకు వచన రూపాంధ్రీకరణము. (1901 ముద్రి.)
- 3. సాహసిక కథార్ణవము (రాజపుత్రస్థానములోని చక్కని కథలు)
- 4. ప్రభువిశ్వాసము (ఆంగ్ల రాజ్యారంభము నుండి నేటిదనుక మన దేశానికి గలుగు నుపకారము లిందు వర్ణితములు)
మూలాలు
మార్చు- ↑ ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 265-71.
- ↑ "Krishna Rao, Kochcharlakota Ramachandra Venkata".
{{cite web}}
: CS1 maint: url-status (link)