ఆంధ్ర రచయితలు
ఆంధ్ర రచయితలు ప్రముఖ తెలుగు రచయితల జీవితచిత్రాలను కలిగిన రచన. దీనిని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించగా అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు 1950లో ముద్రించారు.
ఆంధ్ర రచయితలు | |
కృతికర్త: | మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి |
---|---|
ముద్రణల సంఖ్య: | 3 |
అంకితం: | ఆకొండి రామమూర్తి శాస్త్రి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | జీవితచరిత్ర |
ప్రచురణ: | అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి |
విడుదల: | 1950, 1975, 2013 |
ఇది 1975 సంవత్సరాలలో ద్వితీయ పర్యాయం ముద్రించబడినది.[1] మధునాపంతుల వారు 1992లో పరమపదించేవరకూ సేకరించిన మరో 12 మంది కవుల చరిత్రను కూడా కలిపి ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మధునాపంతుల ట్రస్టు ద్వారా ఈ తాజా సంపుటాన్ని (మూడవ ముద్రణ) 2013లో వెలువరించారు.[2]
ప్రథమభాగములోని రచయితలు
మార్చు- పరవస్తు చిన్నయసూరి
- మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి
- కోరాడ రామచంద్రశాస్త్రి
- మతుకుమల్లి నృసింహకవి
- వారణాసి వేంకటేశ్వర కవి
- ఆకొండి వేంకటకవి
- పరవస్తు వేంకట రంగాచార్యులు
- నరసింహదేవర వేంకటశాస్త్రి
- రేమెల వేంకట రాయకవి
- అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి
- మండపాక పార్వతీశ్వరశాస్త్రి
- మాడభూషి వేంకటాచార్యులు
- ముడుంబ నృసింహాచార్యకవి
- కొక్కొండ వేంకటరత్నశర్మ
- బహుజనపల్లి సీతారామాచార్యులు
- ఆదిభట్ట నారాయణదాసు
- కందుకూరి వీరేశలింగకవి
- త్రిపురాన తమ్మయదొర
- వావిలాల వాసుదేవశాస్త్రి
- గురజాడ శ్రీరామమూర్తి
- వేదము వేంకటరాయశాస్త్రి
- ధర్మవరము రామకృష్ణమాచార్యులు
- దేవులపల్లి సోదరకవులు
- పురాణపండ మల్లయ్యశాస్త్రి
- పారనంది రామశాస్త్రి
- వడ్డాది సుబ్బారాయకవి
- కోలాచలము శ్రీనివాసరావు
- శొంఠి భద్రాద్రి రామశాస్త్రి
- తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి
- కల్లూరి వేంకటరామశాస్త్రి
- మచ్చ వేంకటకవి
- ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రి
- జయంతి రామయ్య
- పూండ్ల రామకృష్ణయ్య
- అల్లంరాజు రంగశాయికవి
- మేడేపల్లి వేంకటరమణాచార్యులు
- గిడుగు వేంకటరామమూర్తి
- కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి
- వావిలికొలను సుబ్బారావు
- నాదెళ్ళ పురుషోత్తమకవి
- శృంగారకవి సర్వారాయకవి
- దాసు శ్రీరామకవి
- ఆచంట వేంకటరాయ సాంఖ్యాయనశర్మ
- పానుగంటి లక్ష్మీనరసింహరావు
- నాగపూడి కుప్పుస్వామి
- శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి
- కూచి నరసింహము
- చిలకమర్తి లక్ష్మీనరసింహము
- చిలుకూరి వీరభద్రరావు
- కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు
- కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు
- జనమంచి వేంకటరామయ్య
- తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య
- వత్సవాయి వేంకటనీలాద్రిరాజు
- జనమంచి శేషాద్రిశర్మ
- త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి
- తిరుపతి వేంకటకవులు
- వేంకట రామకృష్ణ కవులు
- వేంకట పార్వతీశ్వర కవులు
- అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి
- వేలూరి శివరామశాస్త్రి
- తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి
- దుర్భాక రాజశేఖరకవి
- గడియారము వేంకటశేషశాస్త్రి
- విక్రమదేవ వర్మ
- మంత్రిప్రెగడ భుజంగరావు
- ఆకొండి రామమూర్తిశాస్త్రి
- చర్ల నారాయణశాస్త్రి
- వడ్డెపాటి నిరంజనశాస్త్రి
- ఉమర్ ఆలీషాకవి
- వజ్ఝుల చినసీతారామశాస్త్రి
- కోటగిరి వేంకట కృష్ణారావు
- వేంకటాద్రి అప్పారావు
- గురుజాడ వేంకట అప్పారావు
- విశ్వనాధ సత్యనారాయణ
- కట్టమంచి రామలింగారెడ్డి
- మల్లాది సూర్యనారాయణ శాస్త్రి
- వేటూరి ప్రభాకరశాస్త్రి
- చిలుకూరి నారాయణరావు
- మల్లంపల్లి సోమశేఖరశర్మ
- రాయప్రోలు సుబ్బారావు
- రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
- పింగళి లక్ష్మీకాంతము
- కాటూరి వేంకటేశ్వరరావు
- మాడపాటి హనుమంతరావు
- సురవరము ప్రతాపరెడ్డి
- దువ్వూరి రామిరెడ్డి
- దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
- గుర్రం జాషువకవి
- అడవి బాపిరాజు
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
- సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి
- వెంపరాల సూర్యనారాయణశాస్త్రి
- భమిడిపాటి కామేశ్వరరావు
- వేదుల సత్యనారాయణశాస్త్రి
- నోరి నరసింహశాస్త్రి
- తుమ్మల సీతారామమూర్తి చౌదరి
ప్రముఖుల అభిప్రాయాలు
మార్చు" శ్రీసత్యనారాయణ శాస్త్రిగారి యీ గ్రంథ నిర్మాణమాయా గ్రంథకర్తల దేశకాలములు గ్రంథముల పేళ్ళు మచ్చు పద్యములు నను తీరున గాక ధ్వని ప్రాయమైన చతుర కవితా విమర్శనముతో వక్రోక్తి చమత్కృతితో రసవత్కావ్యమువలె గంభీరార్థమై మనోజ్ఞమై యున్నది. కొందరు కవులు గూర్చి వీరు నెరపిన ప్రశంసా వాక్యములలో కొన్ని పలుకుబళ్ళై భాషలో పాదుకొనిదగియున్నవి. శాస్త్రిగారు పద్య రచనమందు, గద్యరచనమందును మంచి వైపువాటములెరిగిన జగజాణలు. " - వేటురి ప్రభాకర శాస్త్రి