కొట సత్తెమ్మ దేవాలయం
కొట సత్తెమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం ఈ ఆలయం ఉంది.[1]
కొట సత్తెమ్మ దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 16°55′N 81°40′E / 16.92°N 81.67°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | పశ్చిమగోదావరి |
ప్రదేశం: | నిడదవోలు |
ఆలయ వివరాలు | |
ప్రధాన దేవత: | కొట సత్తెమ్మ |
చరిత్ర
మార్చుఈ ఆలయ నిర్వహణ ప్రభుత్వ దేవాదాయశాఖ ఆధీనంలో జరుగుచున్నది.
దేవాలయం ప్రాంగణంలో, ఆలయ నిర్హాకులచే ఒకగోడ మీద వ్రాయబడిన సమాచారం ప్రకారం:గుడిలోని మూల విగ్రహం 11 వ శతాబ్ది నాటి తూర్పుచాళుక్యుల కాలంనాటిదని తెలియుచున్నది.శ్రివధ్య పురాన్ని పాలించిన కాకతీయరాజు వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలందుకొని కాలక్రమేన కనుమరుగై విగ్రహం 1936 సంవత్సరములో తిమ్మరాజు గ్రామంలో గల శ్రీదేవులపల్లి రామమూర్తిగారి పొలములో బయలు పడింది. ఈ ప్రాంతాన్ని చాలావరకూ నూజివీడు రాజులు పరిపాలించినట్టుగా ఆలయ చరిత్ర పుస్తకాలలో రాయబడిఉన్నది. ఈ గ్రామ పూర్వమమ దేవులపల్లి వారి అగ్రహారంగా పిలువబడినది, ఆగ్రామంలో కృష్ణాజిల్లా అకిరిపల్లి నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన దేవులపల్లి రామ సుబ్బరాయ శాస్త్రి గారి కుమారుడైన శ్రీరామ శాస్త్రి గారి పొలములో పొలం దున్నుతూ ఉండ్గా అమ్మవారి విగ్రహం బయల్పడినది. అయన కొన్నాళ్ళు బయటపడిన ప్రదేశంలోనే పూజాదికాలు నిర్వహించాడు, తరువాత కొంత కాలమునకు ఆయన కలలో కనిపించి దేవాలయము నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించడం వలన తన పొలం కొంతభాగం దేవాలయ నిర్మాణమునకు కేటాయించి 1935లో భక్తులు అమ్మవారి దేవాలయ నిర్మాణం కావించి, చుట్టూ ప్రహరీ కట్టి పూజాదులు నిర్వహించుట మొదలెట్టినారు. అప్పటి నుండి ఆలయము వేగముగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతము ఏడాదికి యాభై లక్షల ఆదాయం కలిగిన పెద్ద దేవస్థానముగా రూపుదాల్చింది.1976, 77 సంవత్సరాలలో దేవాలయ విస్తరణ కావించారు.. క్రమముగా ఆలయ ప్రాచుర్యం పెరుగుతూ పోవడం వలన మళ్ళీ ఆలయమును 2002 లో పెద్దగా నిర్మించారు.
దేవాలయం తెరచు వేళలు
మార్చుముఖ్య పర్వదినాలలో, ఆదివారం నాడు ఉదయం 6:00 గంటలనుండి సాయంత్రం 800 గంటలవరకు, మిగిన దినంలలో ఉదయం 6:00 గంటలనుండి మద్యహాన్నం:12.30 వరకు, తరువాత 3:30 నుండి రాత్రి 7:30 వరకు గుడిని తెరచి వుంచెదరు.
దేవస్థానం లో నిర్వహించు పండుగలు
మార్చు- చైత్రమాసం:ఉగాది, శ్రీ రామనవమి
- వైశాఖ మాసం:శ్రీ శంకర జయంతి, శ్రీ హనుమత్ జయంతి
- జేష్ట్యమాసం:
- ఆషాఢమాసం:తొలి ఏకాదశి
- శ్రావణమాసం:శ్రావణ మాస పూజలు, చండిహోమము, వేదసభ వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, శుక్రవారాలలో లక్షకుంకుమార్చన పూజ.
- భాద్రపద మాసం:వినాయక చవితి.
- ఆశ్వీయుజమాసం:శ్రీ దేవి నవరాత్రులు, దీపావళి
- కార్తీక మాసం:కార్తీక సోమవారాలు, పౌర్ణమి
- మార్గశిరమాసం:తిరునాళ్ళు, హనుమత్ వ్రతం
- పుష్యమాసం:ఇంగ్లీసు సంవత్సరాది, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి
- మాఘ మాసం:రథ సప్తమి
- పాల్గుణ మాసం:
పూజా వివరాలు
మార్చు- ప్రత్యేక కుంకుమ పూజ:రు.50.శ్రీ దేవి నవరాత్రుల సమయమందుమాత్రమే పూజాసామాగ్రి, అమ్మవారి ప్రతిమ, ప్రసాదం ఇవ్వబడును.
- కుంకుమ పూజ:రు.20 లు
- శ్రీ దేవి నవరాత్రుల చండీహోమంలో పాల్గొను దంపతులు:రు.500 లు.శ్రీ దేవినవరాత్రములు, శ్రావణమాసంలో రోజు సాయంత్రం 4:00 గంటలకు నిర్వహించు చండీ హోమంకార్యక్రమంలో పాల్గొను దంపతులకు ద్రవ్యం దేవస్థానం వారిచే ఇవ్వబడును.
- అక్షరాభ్యాసం, నామకరణం జరుపబడును.
బస్సు సౌకర్యంః దేవాలయానికి మార్గం : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రైల్వేస్టేషన్, బస్ కాంప్లెక్స్ కు యర్నగూడెం రూటులో 3 కి.మీ. దూరంలో దేవాలయం ఉంది. రైల్వే స్టేషన్, బస్టాండ్ నుండి బస్సులు, ఆటోల సదుపాయం ఉంది.
మూలాలు
మార్చు- ↑ Kotasattemma temple, Nidadavolu. "Sri Kotasattemma Temple". Archived from the original on 2016-04-15.