కొఠారు అబ్బయ్య చౌదరి

కొఠారు అబ్బయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దెందులూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కొఠారు అబ్బయ్య చౌదరి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు చింతమనేని ప్రభాకర్
నియోజకవర్గం దెందులూరు, ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం 1982
కొండలరావుపాలెం , పెదవేగి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి అనురాధ

జననం, విద్యాభాస్యం మార్చు

కొఠారు అబ్బయ్య చౌదరి 1982లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలం, కొండలరావుపాలెం గ్రామంలో జన్మించాడు. ఆయన చెన్నై లోని ఆర్.ఎం.కె ఇంజనీరింగ్ కాలేజీ నుండి 2004లో బీటెక్ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

కొఠారు అబ్బయ్య చౌదరి ఆయన తండ్రి రామచంద్రరావు కాంగ్రెస్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాడు. లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ఆయన తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. కొఠారు అబ్బయ్య చౌదరిలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దెందులూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ పై 17459 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి ద్వారకా తిరుమల వరకు పాదయాత్ర చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు.[3][4]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "Denduluru Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  2. Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  3. Sakshi (31 May 2019). "ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాదయాత్ర". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  4. BBC News తెలుగు (24 May 2019). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే". BBC News తెలుగు. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.