కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ

కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కాడా) తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కొడంగల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 2023 డిసెంబరు 30న కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు, విద్యా, ఆరోగ్య రంగాల్లో నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడం, యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు వంటి ప్రోగ్రామ్‌లను నిర్వహించనున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి వికారాబాద్ జిల్లా కొడంగల్‌ను ప్రధాన కేంద్రంగా కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.[2]

విధులు

మార్చు
  1. సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా పథకాలు, విద్యుద్దీకరణ, వీధి దీపాలు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల పనులు/పథకాలు చేపట్టడం.
  2. ఉత్పాదకత పెంపుదల కోసం వినూత్న జీవనోపాధి కార్యక్రమాలను చేపట్టడం, నైపుణ్యాన్ని పెంచే స్థాయికి అనుసంధానించబడిన ఉపాధి కల్పన కార్యకలాపాలకు శిక్షణ ఇవ్వడం.
  3. ఆరోగ్యం వంటి సామాజిక అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన,
  4. కావలసిన లక్ష్యాలను సాధించడానికి విద్య మొదలైనవి.
  5. నేల, భూగర్భ జలాలు వంటి అన్ని సహజ వనరులను వాంఛనీయ స్థాయిలకు సమర్థవంతంగా ఉపయోగించడం.
  6. స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిని నిర్ధారించడానికి నీటి సంరక్షణ పనులు/పథకాలను చేపట్టడం.
  7. అనువైన పరిశ్రమలను ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించడం, ప్రోత్సహించడం.

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (30 December 2023). "కొడంగల్‌కి కాడా". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
  2. Namaste Telangana (31 December 2023). "కొడంగల్‌ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.