కొత్తపల్లి, విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గంగరాజు మాడుగుల మండలం లోని గ్రామం. చింతపల్లి నుంచి పాడేరు వెళ్లే మార్గంలో కొక్కిరపల్లి ఘాట్‌ దిగువన కొత్తపల్లి గ్రామం ఉంది. ఇక్కడ 20 నుంచి 50 మీటర్ల ఎత్తుతో పది జలపాతాలు ఉన్నాయి. పాడేరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో, జి.మాడుగుల నుండి చింతపల్లి మార్గంలో ఈ జలపాతం ఉంది. కొత్తపల్లి గ్రామస్థులు, కొంతమంది విద్యార్థులు ఈ జలపాతాన్ని 1012 లో వెలుగులోకి తెచ్చారు . ఈ జలపాతం ముందు భాగం నుంచి కర్రలు, రోడ్డు మార్గం ద్వారా పర్యటకులు లోపలికి వెళ్తుంటారు. వివిధ మండలాలు, జిల్లాల నుండి సందర్శకులు జలపాత ప్రదేశానికి వస్తుంటారు.

కొత్తపల్లి జలపాతం
Kothapally water falls.jpg
కొత్తపల్లి జలపాతం
ప్రదేశంకొత్తపల్లి, జి.మాడుగుల మండలం, విశాఖపట్నం జిల్లా
అక్షాంశరేఖాంశాలు17.98991°N 82.47899°E

కొత్తపల్లి, విశాఖపట్నానికి పశ్ఛిమంగా 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నం నుండి రోడ్డు సౌకర్యం ఉంది.

వెదురు వనంసవరించు

జలపాతం సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించే విధంగా ప్రభుత్వం, 2018 లో ఒక వెదురు వనాన్ని ఏర్పాటు చెయ్యడం మొదలుపెట్టింది. ఈ ఉద్యానవనంలో 16 రకాల వెదురు మొక్కలను నాటుతారు. మహారాష్ట్ర లోని అమరావతి అటవీ ప్రాంత వెదురు ఉద్యానవనం నుంచి ఈ మొక్కలను తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ అధికారి చెప్పారు.[1]

 
కొత్తపల్లి జలపాతం

మూలాలుసవరించు

  1. "గిరిజనులకు ఆధునిక వైద్యం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 2020-06-09. Retrieved 2020-06-09.