పాడేరు
పాడేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలానికి చెందిన గ్రామం, జిల్లా కేంద్రం. జిల్లా విస్తారం ఎక్కువగానున్నందున, జిల్లా కలెక్టరు వారానికి రెండు రోజులు రంపచోడవరంలో బసచేస్తారు. పాడేరు సుందర అటవీ ప్రాంతం. కొన్ని కొండజాతులు తండాలు ఈ అడవి జీవనదారంగా జీవిస్తున్నాయి. పాడేరు అభయారణ్యంలో దొరికే జీలుగ, కుంకుళ్ళు, సీమచింతకాయలు, కట్టెలు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం. ఈ దేవాలయములో పూజలు నిర్వహిస్తే శుభం జరుగునని గొప్ప విశ్వాసం.
పాడేరు | |
---|---|
గ్రామం | |
Coordinates: 18°05′00″N 82°40′00″E / 18.0833°N 82.6667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు |
Government | |
• Type | గ్రామపంచాయితీ |
• Body | పాడేరు గ్రామ పంచాయితీ |
Elevation | 904 మీ (2,966 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 8,787 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 533 024 |
వాహన నమోదు | AP31 (గతం) AP39 (30 జనవరి 2019 నుండి)[2] |
భౌగోళికం
మార్చురాష్ట్ర రాజధాని అమరావతికి ఈశాన్యంగా 421కి.మీ దూరంలో ఉంది. సమీప నగరమైన విశాఖపట్నానికి వాయవ్యంలో 97 కి.మీ దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 జనగణన ప్రకారం జనాభా 8787.[1]
పరిపాలన
మార్చుపాడేరు గ్రామ పంచాయితీ గ్రామ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సదుపాయాలు
మార్చుపాడేరు విశాఖపట్నం రహదారి పై ఉంది. పాడేరు -రంపచోడవరం రహదారి జిల్లా కేంద్రాన్ని, కలెక్టరు తాత్కాలిక కార్యాలయం గల రంపచోడవరాన్ని కలుపుతుంది. దగ్గరలోని రైల్వే స్టేషను విశాఖపట్నం.
దర్శనీయ స్థలాలు, దేవాలయాలు
మార్చు- అరకులోయ
- శ్రీ మోదకొండమ్మ దేవాలయం. పాడేరు మండలం: నర్సీపట్నం-పాడేరు రోడ్డులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పాదాలు ప్రసిద్ధి. పాడేరు మోదకొండమ్మ ఆలయానికి వెళ్లే ముందు దర్శించుకుంటారు. ఇది పాదాలు మోడపల్లి జంక్షన్ ఏజెన్సీ గ్రామం పడాలలో ఉంది.
- మత్స్యగుండం: పాడేరు దగ్గరగల లోయ. చిన్న నదీపాయలో విస్తారంగా చేపలుంటాయి. సందర్శకుల ఇచ్చే తినుబండారాలను తింటాయి. గిరిజనులు వీటిని దేవతలుగా భావించి పట్టుకోరు. దగ్గరలోని చిన్న శివాలయంలో శివరాత్రి పండుగ ఆచరిస్తారు. [3]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Alluri Sitharamaraju District, Chief Planning officer (2022-05-09). District Handbook of Statistics - Alluri Sitharama Raju district (PDF).
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
- ↑ DHS-2022, p. 14-16.
ఆధార గ్రంథాలు
మార్చు- DHS-2022 (2022-05-09). District Handbook of Statistics - Alluri Sitharama Raju district (PDF).
{{cite book}}
: CS1 maint: numeric names: authors list (link)