కొత్తపల్లి మాసపత్రిక

కొత్తపల్లి బాలల కోసం రూపొందించబడిన మాసపత్రిక. ఇందులో రచనలు చాలా వరకూ విద్యార్థులచే రచించబడతాయి. ఇది ముద్రిత, అముద్రిత (e-పుస్తకం) రూపాలలో అందుబాటులో ఉంది.[1] ఇది అనంతపురం నుంచి వెలువడుతున్న పిల్లల మాసపత్రిక. తెలుగు పిల్లలకు మానవీయ స్పర్శ ఉన్న కథలను, ఆటపాటలను, విద్య, విజ్ఞాన, వినోదాలను, పిల్లల స్వీయ దృక్పథంలో బేషరతుగా అందించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్న ఈ పత్రికలో రచయితలు చాలామంది చిన్న పిల్లలే. ఈ పత్రికను 2008 నుండి నడిపిస్తున్నారు.కొత్తపల్లి ఒక సామూహిక ప్రయత్నం.

కొత్తపల్లి
సంపాదకులునారాయణ
వర్గాలుకథలు, బాలసాహిత్యం
ముద్రణకర్తకొత్తపల్లి ప్రచురణలు
సంస్థకొత్తపల్లి ప్రచురణలు
దేశంభారతదేశం
కేంద్రస్థానంఅనంతపురం, ఆంధ్రప్రదేశ్
భాషతెలుగు

కొత్తపల్లి లో కథలు రాయడం అనే లిటరరీ ఎఫర్ట్‌ని ఓపెన్ సోర్స్ స్పిరిట్‌కి అన్వయిస్తూ వివరించవచ్చు. ఉదాహరణకి ఎవరైనా కొత్తపల్లి లోని కథలని ఎప్పుడైనా ఎక్కడైనా ముద్రించి ఎవరితోనైనా పంచుకోవచ్చు. హక్కులు అన్నీ పిల్లలవే. కథలకి బొమ్మలు వేయించి ఒక వేదికని ఏర్పరచడం, ఒక సమన్వయ కర్తగా వ్యవహరించడం మాత్రమే కొత్తపల్లి చేసే పని. ఒకసారి వెబ్‌సైట్‌లో పెట్టాక ఇక అన్ని హక్కులూ సమూహానివే అన్న ఈ నమూనా (మోడల్) కొత్తపల్లి వెనకాల ఉన్న ముఖ్యమైన కోణం.కొత్తపల్లి పత్రికను 2011 జనవరి నుండి అంటే, ముఫ్ఫైమూడో సంచికనుండి ఆఫ్‌సెట్లో ముద్రిస్తూ ఉన్నారు. అనంతపురం లోని టింబక్టు ప్రాంతంలోని బడులు కొన్నింటిలోని విద్యార్థులు కలిసి నిర్వహిస్తున్న పత్రిక ఇది పత్రికని ’క్రియేటివ్ కామన్స్’ లైసెన్సు BY-NC-SA 4.0 తో విడుదల చేసారు.[2] ఇది విరివిగా ఓపెన్ సోర్సు ను వాడడమే కాక దాని గురించి ప్రచారం చేస్తుంది.[3] కొత్తపల్లి పత్రిక ఆన్లైన్ లో ఇక్కడ చదవొచ్చు

కొత్తపల్లి కార్యబృందం[4] మార్చు

1. నిర్వహణ మార్చు

వ్యవస్థ,విషయ వస్తువు, లెక్కాచారాలు: నారాయణ

ముద్రణ: వీరాంజనేయులు

వెబ్‌సైటు, సాంకేతిక విషయాలు: ఆనంద్

సాంకేతిక సహకారం: లక్ష్మి

సలహాలు, సహకారం: సుబ్బరాజు

ప్రధాన సంపాదకత్వం: నారాయణ

సహాయక సంపాదకత్వం: మంజునాధ్

3. సహాయం మార్చు

చిత్రాలు, కళ: వీరాంజనేయులు

సహచిత్రకారుడు: అడవి రాముడు

లెక్కాచారాలు, డబ్బులు, ఉత్తర ప్రత్యుత్తరాలు: మంజునాధ్, అలివేలమ్మ శ్రేయోభిలాషిగా నాలుగు మంచి ముక్కలు: రాధ మండువ

మూలాలు మార్చు

  1. "కొత్తపల్లి డౌన్లోడులు (కొత్తపల్లి)". kottapalli.in. Retrieved 2020-08-31.
  2. "Creative Commons — Attribution-NonCommercial-ShareAlike 4.0 International — CC BY-NC-SA 4.0". creativecommons.org. Retrieved 2020-08-31.
  3. "కొత్తపల్లి – తెలుగు పిల్లల ఈ-మాసపత్రిక – పరిచయం". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). 2010-04-19. Retrieved 2020-08-31.
  4. "కొత్తపల్లి బృందం-వివరాలు (కొత్తపల్లి)". kottapalli.in. Retrieved 2020-08-31.