అల్లుడు
ఆచారాలు
మార్చుపెళ్ళిలో అల్లుడు అలక పానుపు ఎక్కడం, అత్త మామలు అల్లుడి కోరికలు తీర్చి అలక పానుపు దించుతారు. కన్యాదానంలో మామ కాళ్ళు కడగడం, పండగలలో సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు, కూతురులను ఇంటికి ఆహ్వానించి బహుమతులివ్వడం ఒక ఆచారం.
కొందరు ఒకరే కూతురున్నవారు అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకొని ఇంటి బాధ్యతలను అతనికి అప్పగిస్తారు.
సామెతలు
మార్చుఅల్లుడిని దశమ గ్రహంగా కూడా అభివర్ణిస్తారు. ఎందుకంటే అతను అత్త మామలను వరకట్నమని, కానుకలు ఇమ్మని పరి పరి విధాలుగా బాధిస్తాడు కనుక (అందరు అళ్ళుల్లు కాకపొయినా).
అల్లుడు అత్త వారింటిలో ఛెలయలి కట్ట తెగే వరకు ఉండ కూడదనే సామెత ఉంది. చాలా కుటంబాలలో మజ్జిగ లేక పెరుగు అన్నం తినేప్పుడు అన్నాన్ని కోపుగా చేసి ఒక గుంటలా చేస్తారు. అందులో మజ్జిగ కాని పెరుగు కాని పొయడానికి వీలుగా. అయితే మజ్జిగ విసురుగా పొస్తే ఆ కట్ట (చెలియలి కట్ట) తెగిపొతుంది. అంటే అల్లుని మీద నిర్లక్ష్య భావం వచ్చిందని అర్థం.