కొన్సామ్ ఇబోంచా సింగ్
కొన్సామ్ ఇబోంచా సింగ్ మణిపుర్ లో సాంప్రదాయ లైఫాదిబి ఆటవస్తువులు, బొమ్మలను తయారు చేసే భారతీయ కళాకారుడు.[1] అతను వివిధ జాతీయ ప్రదర్శనలలో పాల్గొన్నాడు. హస్తకళలో అతను చేసిన కృషికి మణిపూర్ రాష్ట్ర పురస్కారం అందుకున్నాడు. కళలో అతను చేసిన మార్గదర్శక కృషికి గాను మార్చి 2022లో ఢిల్లీ లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.[2] మూడు దశాబ్దాలకు పైగా, అతను బొమ్మలను తయారు చేస్తూ, తద్వారా గుర్తింపు, ప్రశంసలను పొందుతున్నాడు.[3]
కొన్సామ్ ఇబోంచా సింగ్ | |
---|---|
జననం | మణిపూర్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
అవార్డులు | పద్మశ్రీ (2022) |
ప్రారంభ జీవితం, వృత్తి
మార్చుఅతను సాంస్కృతిక వారసత్వం గల కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఇబోంచా సింగ్ డాల్స్ అండ్ టాయ్స్ విభాగంలో జాతీయ అవార్డు గ్రహీత.[4] కొన్సమ్ సింగ్ తల్లి కొన్సమ్ ఒంగ్బి గంభీని దేవి కూడా నీటి రెల్లు గడ్డి నుండి చేతితో తయారు చేసిన వస్తువులను తయారు చేసే ప్రసిద్ధ 'కౌనా' హస్తకళకు జాతీయ అవార్డు గ్రహీత. కొన్సమ్ తన తల్లిదండ్రుల నైపుణ్యాలను వారసత్వంగా పొంది, తన తండ్రి పద్ధతులను అనుసరించి, మణిపూర్ రాష్ట్ర పురస్కారంతో తన స్వంత గుర్తింపుకు దారితీసింది.[5][6]
పురస్కారాలు
మార్చు- 2022: కళారంగంలో భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీ పద్మశ్రీ ప్రదానం చేశారు
- 2021: హస్తకళ చేసిన కృషికి మణిపూర్ రాష్ట్ర అవార్డు అందుకున్నారు
మూలాలు
మార్చు- ↑ "Padma Awards 2022: Unsung doll maker from Manipur Konsam Ibomcha Singh 'grateful' for recognition". Imphal Free Press (in ఇంగ్లీష్). Archived from the original on 2023-03-27. Retrieved 2024-06-27.
- ↑ "Manipur's Traditional Doll-Maker Awarded Padma Shri". NDTV.
- ↑ "Padma Awards 2022: From folk artists to painters, meet the awardees recognised for their work in the field of art and culture". The Indian Express (in ఇంగ్లీష్). 22 March 2022.
- ↑ Kadapa-Bose, Surekha (17 May 2021). "At 58, Manipur Artist Makes 100-YO Doll Making Tradition His Own, Boosts His Income". The Better India.
- ↑ EastMojo, Team (22 March 2022). "Manipur doll maker, seven others from NE conferred Padma Awards". EastMojo.
- ↑ "Manipur's Doll Maker: Know About the 58-year-old Doll Making Artist from Manipur - Sentinelassam". sentinelassam.com (in ఇంగ్లీష్). 19 May 2021.