కొప్పుల వసుంధర సామజిక సేవకురాలు, ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌, కంటెంట్‌ రైటర్‌. ఆమె ‘వీవ్‌ మీడియాస్‌’ సంస్థను నెలకొల్పి దివ్యాంగుల సంక్షేమం కోసం ఈవెంట్స్‌ నిర్వహిస్తుంది. వసుంధర ఇంటర్నేషనల్‌ హ్యుమన్‌ రైట్స్‌ నుంచి సేవారత్న అవార్డ్‌, ఐసీఐసీఐ బ్యాంకు నేషనల్‌ అడ్వాంటేజ్‌ విమెన్‌ సత్కారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకుంది.[2]

కొప్పుల వసుంధర
జననం1985
వృత్తి
  • సామజిక సేవకురాలు
  • ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌
  • కంటెంట్‌ రైటర్‌
జీవిత భాగస్వామి
దేవులపల్లి నరేందర్‌
(m. 2021)
[1]
తల్లిదండ్రులుఆనందరావు, ప్రమీలమ్మ
సన్మానాలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారం (2013)

జననం & విద్యాభాస్యం మార్చు

కొప్పుల వసుంధర ఆంధ్రప్రదేశ్, అనంతపురం, శెట్టూరు లో ఆనందరావు, ప్రమీలమ్మ దంపతులకు జన్మించింది. ఆమెకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు పోలియో డ్రాప్స్ వికటించి కాళ్లు చచ్చుబడ్డాయి. వసుంధర దీంతో మండలంలోనే పదో తరగతి వరకూ, ఇంటర్మీడియట్ అనంతపురంలో, గుంటూరు ఎస్.కె. యూనివర్సిటీలో డిగ్రీ, మాస్‌ కమ్యూనికేషన్‌లో పీజీ పూర్తి చేసింది.

పురస్కారాలు మార్చు

  • లేడీ లెజెండ్‌ అవార్డు – 2018 (ట్యూటర్స్‌ ప్రైడ్‌ ఆర్గనైజేషన్‌)
  • విశిష్ట సేవా పురస్కార్‌ 2018 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి)
  • ఇండియన్‌ అడ్వాంటేజ్‌ ఉమెన్‌ అవార్డు 2018 (దేశవ్యాప్తంగా వచ్చిన 19,300 అప్లికేషన్లలో 25 మందిని ఎంపిక చేయగా వారిలో ఒకరు).
  • 2013లో జరిగిన ‘మిస్‌ వీల్‌ చెయిర్‌’ ప్రోగ్రామ్‌లో ‘మోస్ట్‌ వోటెడ్‌ గర్ల్‌ ఆఫ్‌ ద నేషన్‌’ అవార్డు (ఆంధ్రప్రదేశ్‌)
  • తెలుగు రక్షణ సమితి, హైదరాబాద్‌ వారి నుంచి 2013 ఉత్తమ కవయిత్రి బహుమతి.[3]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (2 July 2021). "ఆదర్శ వివాహం.. కులాలు, అంగవైకల్యాన్ని జయించిన ప్రేమ". Archived from the original on 30 April 2023. Retrieved 30 April 2023.
  2. Namasthe Telangana (3 March 2023). "రెండు కాళ్లు లేకపోయినా ఆత్మబలంతో నిలబడింది.. తనలాంటి వాళ్లకు కొత్త దారి చూపిస్తోంది". Archived from the original on 30 April 2023. Retrieved 30 April 2023.
  3. Sakshi (23 August 2018). "మిస్‌ ఎబిలిటీ". Archived from the original on 30 April 2023. Retrieved 30 April 2023.