కొయ్యకాళ్ళ మనుషులు

కొయ్యకాళ్ళ మనుషులు తెలుగువారి జానపద కళారూపాల్లో ఒకటి. ఉత్సవాలు, జాతర్లలో వీరు కనిస్పిస్తూంటారు.

కొయ్యకాళ్ళ మనిషి

ఆంధ్ర దేశంలో ఉత్సవాల్లో, జాతర్లలో, పెళ్ళిళ్ళలో బుట్ట బొమ్మల ప్రదర్శన చూస్తూనే వున్నాం. అదే మాదిరి కాళ్ళకు కొయ్యలు కట్టుకుని అందిరి కంటే ఎత్తుగా కనిపిస్తూ ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉత్సవ సమయాల్లో నృత్యం చేస్తూ వుంటారు.

తేలికగా వుండే గట్టి కొయ్యలతో కాలికి అమర్చే కొయ్యలను తయారు చేస్తారు. అవి నాలుగడుగులు పొడు గుంటాయి. వాటిని పాదాలకు అమర్చి, గట్టిగా కట్టుకొని మరొక కర్ర సహాయంతో కొంచెం దూరం నడుస్తూ అలాగే నృత్యం ప్రారంభించి ఎవరి సహాయం లేకుండానే తప్పెటల వాయిద్యానికి అనుకూలంగా అడుగులేస్తూ అభినయిస్తారు. ఇలా నృత్యం చేయడానికి నైపుణ్యం కావాలి. కొయ్య కాళ్లతో నృత్యం చేస్తూనే కొన్ని విన్యాసాలు చేసి ప్రేక్షకుల్ని రంజింప చేస్తారు.

అలాగే కొంత మంది లంబాడీలు, ఎరుక సానులూ, కొన్ని కొయ్య బొమ్మలను తయారు చేసి, చేతులతో ఆడిస్తూ, ఆ బొమ్మలకు శృంగారాన్ని కలిగిస్తూ రెండు బొమ్మల మధ్యా కలహాన్ని రేపెడుతూ చమత్కారంగా ఆడిస్తారు. ఇలాంటి ఆటలన్నీ ఒక నాటి జానపదుల్ని ఎంతగానో అలరించాయి. ఈనాడివి చాల అరుదుగా ఉన్నాయి.

సూచికలు

మార్చు