కొరటాల సత్యనారాయణ
కొరటాల సత్యనారాయణ (సెప్టెంబరు 24, 1923 – జూలై 1, 2006) ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. భారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు (సి.పి.ఎం) యొక్క పాలిట్‌బ్యూరో సభ్యుడు.
కొరటాల సత్యనారాయణ | |
---|---|
జననం | కొరటాల సత్యనారాయణ సెప్టెంబరు 24, 1923 గుంటూరు జిల్లా , అమృతలూరు మండలం, ప్యాపర్రు |
మరణం | జూలై 1, 2006 |
ప్రసిద్ధి | ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. |
పదవి పేరు | పాలిట్‌బ్యూరో సభ్యుడు |
రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు (సి.పి.ఎం) |
తండ్రి | పిచ్చయ్య |
తల్లి | శేషమ్మ |
బాల్యము
మార్చుసత్యనారాయణ గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం, ప్యాపర్రు గ్రామంలో 1924 సెప్టెంబరు 24న పిచ్చయ్య, శేషమ్మ దంపతులకు జన్మించాడు. ఒక సోదరుడు, ముగ్గురు సోదరీమణులు. కర్షక పరివారములో పుట్టి, జీవితాన్ని బడుగుల ఉద్ధరణకై ధార పోసి, గుంటూరు జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి పునాదులు వేశాడు.
రాజకీయ పంథా
మార్చుతెలుగు నాట సామ్యవాద ఉద్యమానికి ఆద్యులలో ఒకడు సత్యనారాయణ. పాఠశాల దశలోనే న్యాయ పోరాటమునకు తొలి అడుగులు వేశాడు. 1938-39 తురుమెళ్ళ పాఠశాలలో పరీక్షా విధాన పద్ధతిని వ్యతిరేకించి 11 రోజులు ఉద్యమము చేశాడు. ప్రధానోపాధ్యాయుడు మొండికేసిన ఆ సందర్భములో గుంటూరులో ఉన్న విద్యార్థినాయకుడు మాకినేని బసవపున్నయ్యను కలవడం తటస్థించింది. అదే సత్యనారాయణ లోని కమ్యూనిస్ట్ భావాలకు నాంది. బావమరిది పాతూరి సుబ్బయ్య ఆ సమయములో స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొంటున్నాడు.
బసవపున్నయ్య జోక్యముతో ప్రధానోపాధ్యాయుడు దిగి వచ్చాడు. దాంతో సత్యనారాయణ సమ్మె విరమించాడు. ఆ సమయములో ఒక పాఠశాల పత్రిక నడిపాడు. వామవాద భావాలున్న పాఠశాల డ్రిల్ ఉపాధ్యాయుడు, ఆతని బావమరిఫది మోటూరు హనుమంతరావు ప్రభావముతో సత్యనారాయణ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆకర్షితుడయాడు.
ప్రధానోపాధ్యాయుని హఠాన్మరణముతో ఆతని కుటుంబము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనగా, తోటి విద్యార్థులతో బాటు పల్లెలు తిరిగి 5,000 రూపాయలు సేకరించి వారిని ఆదుకున్నాడు. పిమ్మట రేపల్లెలో విద్య కొనసాగించిన సమయములో మరొక కమ్యూనిస్ట్ నాయకుడు లావు బాలగంగాధరరావు పరిచయము కలిగింది. 1942లో గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరాడు. విద్యార్థినాయకుడుగా ఎదిగాడు. క్విట్ ఇండియా ఉద్యమము, గుంటూరులో పోలీసు కాల్పులు, విద్యార్థుల మరణం ఉద్యమ స్ఫూర్తిని పెంచాయి. 1942లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు. 1943లో జిల్లా విద్యార్థిసంఘ సభ్యుడయ్యాడు.
ఎన్నికలు
మార్చుమరణము
మార్చుసత్యనారాయణ జీవిత చరమాంకములో కాన్సర్ తో పోరాడి 2006 జూలై 1 న హైదరాబాదులో మరణించాడు. సత్యనారాయణకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. [1]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-01. Retrieved 2011-02-03.