రేపల్లె
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రేపల్లె బాపట్ల జిల్లా లోని పట్టణం, అదే పేరుతో గల మండలానికి కేంద్రం.
పట్టణం | |
![]() | |
Coordinates: 16°00′N 80°54′E / 16°N 80.9°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | రేపల్లె మండలం |
Area | |
• మొత్తం | 10.97 km2 (4.24 sq mi) |
Population | |
• మొత్తం | 50,866 |
• Density | 4,600/km2 (12,000/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1086 |
Area code | +91 ( 8648 ![]() |
పిన్(PIN) | 522265 ![]() |
Website |
భౌగోళికం సవరించు
జిల్లా కేంద్రమైన బాపట్లకు పశ్చిమంగా 48 కి.మీ దూరంలో, సమీప నగరమైన గుంటూరు కు ఆగ్నేయంగా 71 కి.మీ దూరంలో ఈ పట్టణం వున్నది.
జనగణన వివరాలు సవరించు
2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 50,866.
పరిపాలన సవరించు
రేపల్లె పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు సవరించు
రేపల్లెలో బస్సు డిపో ఉంది. చుట్టుపక్కల అన్ని గ్రామాలకు రేపల్లె నుండి బస్సులు ఉన్నాయి. పెనుమూడి వారధి 2006 లో నిర్మితమవటంతో రేపల్లె నుండి కృష్ణా జిల్లాలో ఉన్న గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగింది. రేపల్లె, గుంటూరు డివిజన్ లో తెనాలి - రేపల్లె మార్గానికి చివరి స్టేషను. రేపల్లె నుండి తెనాలి,గుంటూరు, హైదరాబాద్కు రైళ్ళు ఉన్నాయి.
విద్యా సౌకర్యాలు సవరించు
గ్రంథాలయం సవరించు
దశబ్దాల చరిత్ర కలిగిన రేపల్లె గ్రంథాలయంలో 32,000 గ్రంథాలుండేవి. ఈ భవనం శిథిలమవడంతో, ఒక నూతన భవనం నిర్మాణం కొరకు ప్రవాసాంధ్రుడు పరుచూరి శ్రీరామకృష్ణయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ పరుచూరి శ్రీనాథ్, 25 లక్షల రూపాయలు వితరణగా అందించడానికి ముందుకు వచ్చారు. పురపాల సంఘం పాలక వర్గం స్పందించి, చంద్రమౌళి పార్కులో 15 సెంట్ల స్థలం కేటాయించింది. భవన నిర్మాణానికి గ్రంథాలయ సంస్థ 35 లక్షల రూపాయల నిధులు మంజూరుచేసింది.[ఆధారం చూపాలి]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు సవరించు
- పెనుమూడి గ్రామం వద్ద ఉన్న కృష్ణా నది ఒడ్డు. 214 జాతీయ రహదారి వారధిపక్కన శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం, లక్ష్మి గణపతి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వవర స్వామి ఆలయం, మాలికాపురత్తమ్మ ఆలయం శివాలయం, సత్యనారాయణ స్వామి ఆలయం, దంపతి సమేతంగా నవగ్రహ ఆలయం మొదలైన ఆలయాలు నిర్మాణంలో ఉన్నవి
ప్రముఖులు సవరించు
- సముద్రాల రాఘవాచార్య, సంగీత దర్శకుడు.
- చంద్రమౌళి, గ్రంథాలయ ఉద్యమకారుడు.
- కాండూరి సీతారాయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు
- పరుచూరి బ్రదర్స్, సిని రచయితలు, నటులు.
- దేవినేని మల్లిఖార్జునరావు మాజీ ఎమ్మెల్యే,బావుడా ఛైర్మన్
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.