కొర్ల రేవతీపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కొర్ల రేవతీపతి

శాసనసభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
2009 - 2009
నియోజకవర్గం టెక్కలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 7 డిసెంబర్ 1959
సుర్జిని, మెళియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 3 జూన్ 2009
విశాఖపట్నం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కొర్ల భారతి
సంతానం శిరీష, స్రవంతి, అనూష, అనిల్ కుమార్
నివాసం గాంధీ నగర్, కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా

రాజకీయ జీవితం

మార్చు

కొర్ల రేవతీపతి తెదేపా ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999 జరిగిన శాసనసభ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2004లో తెదేపా టికెట్ దక్కకపోవడంతో అతను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2009 శాసనసభ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి గెలిచాడు. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకుండానే మరణించాడు. గుండెపోటు రావడంతో విశాఖపట్నం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్య పొందుతూ 2009 జూన్ 3న అతను మరణించాడు. అతనికి భార్య కొర్ల భారతి, పిల్లలు శిరీష, స్రవంతి, అనూష, అనిల్ కుమార్ ఉన్నారు.[2]

మూలాలు

మార్చు
  1. Sakshi (30 March 2019). "టెక్కలి నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
  2. The New Indian Express (3 June 2009). "Tekkali MLA Revathipathi dead". Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.