కొలిపాక శోభారాణి

కొలిపాక శోభారాణి రచయిత్రి

కొలిపాక శోభారాణి
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల కవిసమ్మేళనంలో కవితాగానం చేస్తున్న కొలిపాక శోభారాణి
ప్రసిద్ధికవయిత్రి, రచయిత్రి
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా 2015, జూన్ 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో 400 మంది కవులచే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న కొలిపాక శోభారాణి

విశేషాలు

మార్చు

ఈమె సిరిసిల్లకు చెందిన విశ్రాంత సెస్ ఉద్యోగి. ఈమెకు చిన్నతనం నుంచే సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. చేయూత, సంద్రం, వెన్నెల సోన, స్మృతి, చలనం, అంచు, ఉగ్గం, ఖాయిలా వంటి అనేక కవిత్వాలు రచించింది. అనేక కథలు వ్రాసింది. బలహీనవర్గాల ప్రజల సమస్యలను, దళితుల వెతలను తన కవిత్వం ద్వారా సమాజానికి తెలియజేసింది. తన కవితాసంపుటి 'చలనం' పుస్తకానికి అనేక పురస్కారాలు వచ్చాయి. రంగినేని ఎల్లమ్మ సాహిత్య, రుద్ర రవి స్మారక, సోమెపల్లి వెంకట సుబ్బయ్య, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయి ఉత్తమ కవయిత్రి, మల్లినాథ సూరి కళాపీఠం, గురజాడ అప్పారావు జిల్లాస్థాయి పురస్కారాలు అందుకున్నది. జ్యోతిబా పులే, అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందింది. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి రచించిన చింగారి, ఆమె పదం, చిగురుకొమ్మ పుస్తకాలలో కవితలు రచించింది.[1] ఈమె కవితలు తంగేడువనం, తొలిపొద్దు, ఉద్విగ్న మొదలైన కవితా సంకలనాలలో చోటు చేసుకుంది.

మూలాలు

మార్చు
  1. న్యూస్ టుడే (8 April 2023). "అతివ సాహిత్యం సమాజ హితం". ఈనాడు దినపత్రిక. Retrieved 2 November 2024.