కొల్లాపూర్ రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం

కొల్లాపూర్ రెవెన్యూ డివిజను అనేది తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కొల్లాపూర్ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

కొల్లాపూర్ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లానాగర్‌కర్నూల్

వివరాలు

మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన

మార్చు

కొల్లాపూర్ డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం కొల్లాపూర్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 పెద్దకొత్తపల్లి మండలం 24 రెవెన్యూ గ్రామాలు
2 కొల్లాపూర్ మండలం 20 రెవెన్యూ గ్రామాలు
3 పెంట్లవెల్లి మండలం 8 రెవెన్యూ గ్రామాలు
4 కోడేరు మండలం 18 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-11-16.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-11-16.
  4. "REVENUE DIVISIONS | Nagarkurnool District,Telangana | India". Archived from the original on 2022-10-20. Retrieved 2022-11-16.
  5. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-11-16.