ప్రధాన మెనూను తెరువు

మండలం

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాల ఉప పరిపాలనా విభాగాలు


పంచాయతీ రాజ్ వ్యవస్థలోని కొన్ని మౌలిక రాజస్థ ప్రాంత విభాగమైన పంచాయతి లేదా గ్రామ పంచాయతీలను కలిపి ఒక మండలంగా, పట్టణ ప్రాంతపు జిల్లాని కొన్ని మండలాలుగా విభజించారు. రాష్ట్రంలో ఇలాంటి మండలాలు 1124 మండలాలు గలవు. మండల భూమి, ఆదాయ పరిపాలన తహసీల్దారునిర్వహిస్తారు. ఈ స్థాయిలో స్థానిక పరిపాలనా వ్యవస్థ మండల పరిషత్. జిల్లాలో కొన్ని మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్గా ఏర్పరిచారు. కొత్తగా25 అర్బన్ మండలాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం 18.3.2013 న ప్రకటించింది.అవి: విశాఖ-2, విశాఖ-3, విజయవాడ-2, విజయవాడ-3, తెనాలి, గుంటూరు, నెల్లూరు, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, కడప, కర్నూలు, ఖమ్మం, వరంగల్-2, ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి అర్బన్ మండలాలు

ఆంధ్రప్రదేశ్ మండలాల గణాంకాలుసవరించు

మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా హైదరాబాదు (16).

కోడ్ సంఖ్య. జిల్లా మండలాల సంఖ్య
1 శ్రీకాకుళం 37
2 విజయనగరం 34
3 విశాఖపట్టణం 43
4 తూర్పు గోదావరి 59
5 పశ్చిమ గోదావరి 46
6 కృష్ణా 50
7 గుంటూరు 57
8 ప్రకాశం 56
9 నెల్లూరు 46
10 చిత్తూరు 66
11 కడప 50
12 అనంతపురం 63
13 కర్నూలు 54
14 మహబూబ్ నగర్ 64
15 రంగారెడ్డి 37
16 హైదరాబాదు 16
17 మెదక్ 45
18 నిజామాబాదు 36
19 ఆదిలాబాదు 52
20 కరీంనగర్ 56
21 వరంగల్ 50
22 ఖమ్మం 46
23 నల్గొండ 59
మొత్తం 1124

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

[1]

"https://te.wikipedia.org/w/index.php?title=మండలం&oldid=2604373" నుండి వెలికితీశారు