కోకా రామచంద్రరావు
జస్టిస్ కోకా రామచంద్రరావు (1922–2018) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
కోకా రామచంద్రరావు | |||
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి
| |||
పదవీ కాలం 1984 – 1984 | |||
ముందు | కొండా మాధవరెడ్డి | ||
---|---|---|---|
తరువాత | పాలెం చెన్నకేశవరెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మచిలీపట్నం | 1922 జూలై 5 ||
మరణం | హైదరాబాదు | 2018 జూన్ 17
రామచంద్రరావు 1922, జూలై 5వ తేదీన మచిలీపట్నంలో జన్మించాడు. ప్రాథమిక విద్య, కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోని నోబుల్ ఉన్నతపాఠశాలలో, హిందూ కళాశాల ఉన్నత పాఠశాలలో పూర్తిచేసాడు. ఆ తర్వాత మద్రాసు లయోలా కళాశాలలో బి.ఏ డిగ్రీ పూర్తిచేసుకొని, 1943లో మద్రాసు న్యాయకళాశాల నుండి న్యాయవాద పట్టభద్రుడయ్యాడు. ఈయన పి.వి.రాజమన్నారు, కోకా సుబ్బారావుల వద్ద అప్రెంటీసుగా పనిచేశాడు. 1944, అక్టోబరు 30న మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా చేరాడు. ఆ తర్వాత 1953లో సుప్రీం కోర్టు న్యాయవాదిగా నియమితుడయ్యాడు. న్యాయమూర్తిగా బెంచ్‌కు పదవోన్నతి పొందే మునుపు, రామచంద్రరావు, ఇండియన్ లా రిపోర్ట్స్ సంపాదకుడిగా, కేంద్రప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గా, భారత ఆహార సమాఖ్యకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల సంస్థలకు న్యాయ సలహాదారుగా అనేక పదవులలో పనిచేశాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు కూడా. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాడు. 1968, ఆగస్టు 21 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమించబడ్డాడు.[1] 1968లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1984లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు[2]
ఈయన కొంతకాలం అస్వస్థతతో బాధపడుతూ 2018 జూన్ 17న హైదరాబాదులో మరణించాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "Telangana High Court". Retrieved 27 December 2022.
- ↑ 2.0 2.1 "హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కోకా రామచంద్రరావు మృతి". vyoma.net/. Archived from the original on 27 డిసెంబరు 2022. Retrieved 27 December 2022.
- ↑ "HC remembers Justice Koka Ramachandra Rao". The New Indian Express. 21 June 2018. Retrieved 27 December 2022.