కోకా సుబ్బారావు (ఆంగ్లం: Koka Subba Rao) (జూలై 15, 1902 - మే 6, 1976) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.[1][2]

కోకా సుబ్బారావు
కోకా సుబ్బారావు

1955లో కోకా సుబ్బారావు ఫోటో


ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.
పదవీ కాలము
1956-58 మరియు 1966-67
తరువాత పి. చంద్రారెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 15, 1902
మరణం మే 6, 1976
రాజమండ్రి
మతం హిందూమతము

తొలిరోజులుసవరించు

గోదావరి ఒడ్డున, రాజమండ్రిలో 1902 జూలై 15న కోకా సుబ్బారావు విద్యావంతులైన వెలమ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి సుబ్రమణ్యేశ్వర నాయుడు రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాది. తండ్రి సుబ్బారావు చిన్నతనంలోనే మరణించాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పొందిన తరువాత, మద్రాసు లా కాలేజీలో న్యాయశాస్త్రం చదివాడు. ఆయన మంచి క్రీడాకారుడు.

వృత్తి జీవితంసవరించు

సుబ్బారావు, మామయ్య పి. వెంకట రమణారావు నాయుడు వద్ద పని ప్రారభించాడు. వెంకట రమణారావు నాయుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులుకు జూనియరుగా ఉండేవాడు. ఆయన జిల్లా మున్సిఫ్ గా ఎంపికై గుంటూరు జిల్లా, బాపట్లలో పనిచేసాడు.

వెంకట రమణారావు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క జడ్జిగా పదవోన్నతి పొందిన తర్వాత, సుబ్బారావు తన ప్రజ్ఞాశీలి అయిన బావమరిది పి.వి.రాజమన్నార్తో కలిసి ప్రాక్టీసు కొనసాగించాడు. రాజమన్నార్ ఆ తరువాతి కాలంలో ఆద్వొకేట్ జనరల్ మరియు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. వీరి ద్వయం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రధాన కేసులన్నీ చేపట్టారు. 1948లో సుబ్బారావు బెంచికీ నియమించబడ్డాడు.

ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజాజీ, సీనియర్ జడ్జి అయిన గోవింద మెనన్ ను 1954లో గుంటూరులో ఏర్పాటు కానున్న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పంపాలనుకున్నాడు, కానీ ప్రకాశం పంతులు హైకోర్టు ఏర్పాటును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిగా సుబ్బారావే కావాలని పట్టుబట్టాడు. దానితో గుంటూరులో హైకోర్టు ఏర్పడిన తర్వాత సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు సుబ్బారావు హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగాడు.

1954లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు సుబ్బారావు విశ్వవిద్యాలయపు తొలి సంచాలకునిగా నియమించబడ్డాడు. విశ్వవిద్యాలయల చట్టాన్ని సవరించి రాష్ట్ర గవర్నరుకు విశ్వవిద్యాలయాల సంచాలక పదవిని గవర్నర్లకు పునరుద్ధిరించే వరకు సుబ్బారావు ఆ పదవిలో కొనసాగాడు.

మద్రాసు హైకోర్టులో జడ్జిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత జనవరి 31, 1958న ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడ్డాడు. జూన్ 30, 1966న ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఈయన వ్రాసిన తీర్పులలో ప్రసిద్ధ గోలక్‌నాథ్ - పంజాబ్ రాష్ట్రం కేసు అత్యంత ప్రముఖమైనది. ఈ కేసులో భారత రాజ్యాంగం ఆపాదించిన ప్రాథమిక హక్కులను చట్టసభలు సవరించేందుకు వీలులేదని తీర్పునిచ్చాడు.[3] చట్ట సభలకి (పార్లమెంట్ కి) కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చేసే అధికారంలేదని చారిత్రాత్మిక తీర్పులో పేర్కొన్నారు. ప్రధాన న్యాయవాది సుబ్బారావు, జస్టిస్ షా, సిక్రి, షిలత్, వైదియలింగంతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని ప్రకటించింది.

రచనలుసవరించు

సుబ్బారావు న్యాయసంబంధ విషయాలపై అనేక రచనలు చేశాడు. ఆయన రచనలలో ముఖ్యమైనవి.

 • సోషల్ జస్టిస్ అండ్ లా
 • కాన్స్టి ట్యూషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా
 • ఫండమెంటల్ రైట్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
 • ది ఇండియన్ ఫెడరల్ సిస్టం
 • కాంప్లెక్సిటీ ఇన్ ఇండియన్ పొలిటీ

రాజకీయ జీవితంసవరించు

సుబ్బారావు నాలుగవ రాష్ట్రపతి ఎన్నికలలో, ప్రతిపక్ష పార్టీల యొక్క ఏకగ్రీవ అభ్యర్థిగా పోటీచేయటానికి ఏప్రిల్ 11, 1967న న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు.[4] అయితే ఈ ఎన్నికలలో కాంగ్రేసు అభ్యర్థి అయిన జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజితుడయ్యాడు.

సుబ్బారావు మే 6, 1976న బెంగుళూరులో మరణించాడు.

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

 1. "Profile of the Honorable justice Koka Subba Rao at High Court of Andhra Pradesh". మూలం నుండి 2011-07-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-05-13. Cite web requires |website= (help)
 2. Koka Subba Rao: Strong-Willed Judge in The Great Indian Patriots
 3. Austin, Granville (1999). Working a Democratic Constitution - A History of the Indian Experience. New Delhi: Oxford University Press. pp. 201–202. ISBN 019565610-5.
 4. Supreme Court of India: Biography of K. Subba Rao

ఇంకా చదవండిసవరించు

 • Luminaries of 20th Century, Potti Sreeramulu Telugu University, Hyderabad, 2005.
 • Koka Subba Rao : Strong-Willed Judge in The Great Indian patriots, Volume 2, P. Rajeswar Rao, page. 178.