కోటంరాజు పున్నయ్య

కోటంరాజు పున్నయ్య పాత్రికేయుడు.

బాల్యం మార్చు

కోటంరాజు పున్నయ్య 10 ఆగస్టు 1885న ప్రస్తుత ప్రకాశం జిల్లా చీరాలలో పుట్టాడు.[1] కోటంరాజు నారాయణరావు-వెంకాయమ్మ తల్లిదండ్రులు. బాపట్ల, గుంటూరులలో చదువు సాగించాడు. మెట్రిక్యులేషన్ తప్పడంతో ఇంత్లో చెప్పాపెట్టకుండా ముంబై పారిపోయాడు. అక్కడ తిండి కోసం మేడ మీదకు నీళ్ళు మోసే ఉద్యోగం చేసాడు.

ఉద్యోగం మార్చు

పరిచయం కొద్దీ కాశీనాథుని నాగేశ్వరరావు ఇతనిని అమృతాంజనం కార్యాలయంలో చేర్చుకున్నాడు. అనంతరం ప్రారంభించిన ఆంధ్రపత్రికలో చేరాడు. 1914లో మద్రాసు వెళ్ళి ఆంధ్రపత్రిక దినపత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేసాడు. ఇంగ్లిష్ భాష మీద ఉన్న పట్టు వలన 1916లో హ్యూమానిటీ అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించాడు. 1918లో సాధు వాస్వాని ఆహ్వానం మీద కరాచీ వెళ్ళి 'న్యూటైమ్స్' పత్రిక సహాయ సంపాదకునిగా పని చేసాడు. ఈ న్యూటైమ్స్ పత్రిక ఆపై 'సింధు అబ్జర్వర్' అనే మరో పత్రికలో కలిసిపోయింది. కొన్ని రోజులు సింధు అబ్జర్వర్ కు సహాయ సంపాదకునిగా పని చేసి, సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆనాటి రాజకీయాలను తన రచనలతో పున్నయ్య ఎంతగానో ప్రభావితం చేసాడు. ఏదో ఒక సందర్భంలో సింధు అబ్జర్వర్ యజమాని, పార్సీ వ్యాపారి, ఫకీర్‌జీ కావాస్‌జీ తో అభిప్రాయ భేదాలు వచ్చి స్వచ్ఛందంగా ఇతను తన సంపాదక వృత్తికి రాజీనామా చేసాడు. దివాన్ బహద్దూర్ కాలూ మీల్ వహ్లయాల్ 'డైలీ మెయిల్ కంపెనీ' స్థాపించి, దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధ్యక్షుడిగా పదవి చేపట్టాడు. ఈ సంస్థ సింధు అబ్జర్వర్ పత్రికను పాత యాజమాన్యం నుంచి కొనుగోలు చేసి పున్నయ్యను తిరిగి సంపాదకుడిగా నియమించింది. దాదాపు పాతిక సంవత్సరాలు పున్నయ్య సింధు అబ్జర్వర్ కు సంపాదకునిగా పని చేసాడు.

పాకిస్తాన్ విభజన తరువాత మార్చు

విభజన తరువాత పున్నయ్య బెంగుళూరుకు చేరారు.

మరణం మార్చు

పున్నయ్య 1948లో జరిగిన అఖిల భారత వార్తామండలి సమావేశాలలో పాల్గొనటానికి ముంబై వెళ్ళారు. అక్కడ కాలిబాటపై నడుస్తూ గుండెపోటుకు గురై జులై 27, 1948 న మరణించారు. [2]

మూలాలు మార్చు

  1. హిందూ ఎడిటర్ హూ బిల్ట్ మోడర్న్ సింధ్[permanent dead link]
  2. మన పాత్రికేయ వెలుగులు వైతాళికులు, వయోధిక పాత్రికేయ సంఘం ప్రచురణ, 2011. పేజీ. 8-9