కోటగిరి వెంకటయ్య
కోటగిరి వెంకటయ్య తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.
జీవిత విశేషాలు
మార్చుఅతను 1930లో కరీంనగర్ జిల్లా రుద్రంగిలో జన్మించాడు. ప్రాథమిక విద్య స్థానికంగా రుద్రంగిలోనూ, కోరుట్లలోనూ అభ్యసించాడు. 1946-48 కాలంలో హైదరాబాదు విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. భారత ప్రభుత్వం నుంచి సమరయోధుడిగానూ గుర్తించబడ్డాడు. ప్రత్యక్షంగా రాజకీయ పదవులు పొందకున్ననూ 1977 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో, అత్యవసర పరిస్థితి అనంతరం జనతా పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేశాడు. 1963లో వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టరుగా, 1973లో సిరిసిల్ల వర్తక సంఘం అధ్యక్షుడిగా, 1983లో సిరిసిల్ల అర్బన్ బ్యాంకు వ్యవస్థాపక డైరెక్టరుగా నియమించబడ్డాడు.
1987లో ప్రారంభించిన కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సత్రానికి కోటగిరి వెంకటయ్య వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరించాడు[1]. 2006 వరకు అతను అధ్యక్షులుగా, మిగితా సభ్యులూ కొనసాగారు. 2006లో కోటగిరి వెంకటయ్య మరణించడు.[2]
మూలాలు
మార్చు- ↑ "వేములవాడ: ఘనంగా వెంకటయ్య పదో వర్ధంతి – Andhra Prabha Telugu Daily". Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-17.
- ↑ "సత్రాల పేరుతో రూ.కోట్లల్లో వసూళ్లు..? | కరీంనగర్ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-07-17.
బాహ్య లంకెలు
మార్చు- Rao, C. chandra Kanth (2014-03-02). "Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం): కోటగిరి వెంకటయ్య (Kotagiri Venkataiah)". Encyclopedia in Telugu (తెలుగులో విజ్ఞానసర్వస్వం). Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-17.