కోదండ రామ దేవాలయం
కోదండ రామ దేవాలయం తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు మండలంలోని గొల్లలమామిడాడ గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి పడమర వైపున ఉన్న గాలిగోపురం ఆకాశాన్నంటుతున్నట్లు ఎత్తుగా కనిపిస్తుంది.
కోదండ రామ దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°ECoordinates: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | కోదండ రామ దేవాలయం |
ప్రదేశము | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి |
ప్రదేశం: | బిక్కవోలుగొల్లల మామిడాడ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | కోదండ రామ దేవాలయం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 1889 |
ఆలయ చరిత్రసవరించు
19వ సంవత్సరంలో, గొల్లలమామిడాడలో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి ఓ చిన్న ఆలయాన్ని నిర్మించి అందులో శ్రీ సీతామహాలక్ష్మి శ్రీరామ చంద్రమూర్తులను ప్రతిష్టించారు. అప్పట్లో ఆ ఆలయాన్ని శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం అని పిలిచేవారు. క్రీ.శ. 1889లో నిర్మించిన దేవాలయంలో 24-3-1934న శ్రీ కోదండరామ ప్రతిష్ఠ జరిగాక గర్భాలయం సరిపోయేంతగా లేదని 1946లో దేవాలయ నిర్మాణం ప్రారంభించారు. స్వామి వారి గర్భాలయము చుట్టు 64 స్థంబాలు పుష్పక మంటపము నిర్మించారు. ఆలయం తూర్పు వైపున తొమ్మిది అంతస్థుల గోపురం, 160 అడుగుల ఎత్తులో నిర్మించారు.[1][2]
ఉత్సవాలుసవరించు
ప్రతీ సంవత్సరం శ్రీ రామనవమికి శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవము ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆరు రోజుల పాటు ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి.
మూలాలుసవరించు
- ↑ నాగిరెడ్డి, ఎన్. ఎస్. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలు. 2003.
- ↑ C, Girish. "Temples of Andhra Pradesh and Telangana". www.manatemples.net. Archived from the original on 2019-12-25. Retrieved 2020-03-05.