బిక్కవోలు

ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు మండల గ్రామం

బిక్కవోలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు మండలం లోని గ్రామం. ఇది సమీప పట్టణమైన సామర్లకోట నుండి 17 కి. మీ. దూరంలో ఉంది.

బిక్కవోలు
—  రెవిన్యూ గ్రామం  —
బిక్కవోలు వద్ద పొలాలలో ఉన్న పురాతన శివాలయం
బిక్కవోలు వద్ద పొలాలలో ఉన్న పురాతన శివాలయం
బిక్కవోలు వద్ద పొలాలలో ఉన్న పురాతన శివాలయం
బిక్కవోలు is located in Andhra Pradesh
బిక్కవోలు
బిక్కవోలు
అక్షాంశరేఖాంశాలు: 16°57′00″N 82°03′00″E / 16.9500°N 82.0500°E / 16.9500; 82.0500
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం బిక్కవోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 14,095
 - పురుషులు 6,928
 - స్త్రీలు 7,167
 - గృహాల సంఖ్య 3,432
పిన్ కోడ్ 533 343
ఎస్.టి.డి కోడ్

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

ఈ గ్రామంలో రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. సా.శ.849 - 892 మధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వర ఆలయం,శ్రీ గోలింగేశ్వర ఆలయం, శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నవి. బిరుదాంకితుడనే రాజు పరిపాలించుటవలన ఈ గ్రామాన్ని బిరుదాంకితవోలుగా పిలిచేవారని, కాలక్రమేణ అది బిక్కవోలుగా మార్పు చెందిందని మరియొక కథనం.ఇది కేవలం ఐతిహ్యం.నిరాధార కథనం

గణాంక వివరాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4133 ఇళ్లతో, 14278 జనాభాతో 1966 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6999, ఆడవారి సంఖ్య 7279. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2202 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 308. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587530[1]

2001 జనాభా లెక్కల ప్రకారం బిక్కవోలు జనాభా 14,095. ఇందులో మగవారు 49%, ఆడువారు 51%. సగటు అక్షరాస్యత 70%. ఇది దేశ సగటు అక్షరాస్యత 59.5% కంటే మెరుగు. అక్షరాస్యత మగవారిలో 75%, ఆడువారిలో 66%. పురుషుల సంఖ్య 6,928, మహిళల సంఖ్య 7,167, గ్రామంలో నివాస గృహాలు 3,432 ఉన్నాయి.

సమీప గ్రామాలు మార్చు

బిక్కవోలుకు దగ్గరగా ఉన్న గ్రామాలు ఊలపల్లి, జి.మామిడాడ, అనపర్తి, బలభద్రాపురం, పెదపూడి, ద్వారపూడి, సంపర, పెదబ్రహ్మదేవం, కొమరిపాలెం

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల బిక్కవోలులోనే ఉంది (శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల)., ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ అనపర్తిలోను, ఇంజనీరింగ్ కళాశాల కాకినాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కాకినాడలోను, మేనేజిమెంటు కళాశాల అనపర్తిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొమరిపాలెంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు కాకినాడలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

బిక్కవోలులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి.బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

ప్రయాణ, ఇతర వసతులు మార్చు

 
బిక్కవోలు రైలు సముదాయము
 
బిక్కవోలుకు విరివిగా బస్సు సౌకర్యము కలదు

బిక్కవోలులో రైల్వే స్టేషను, బస్సు స్టేషను, పోస్టాఫీసు, తి.తి.దే.వారి కళ్యాణ మంటపం, ప్రభుత్వ ఆసుపత్రి, మండల ఆఫీసు, అగ్నిమాపక కార్యాలయం, టెలిఫోను ఆఫీసు, బ్యాంకులు, ఆలయాలు, రైసు మిల్లులు, పాఠశాలలు, పెట్రోలు పంపులు వంటి పలు వసతులున్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.పాసింజరు రైళ్ళు ఆగుతాయి.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. రాజమండ్రి నుండి (39 కి.మీ.), కాకినాడ (31 కి.మీ.) నుండి బిక్కవోలుకు తరచు బస్సు సౌకర్యం ఉంది. బిక్కవోలుకు దగ్గరగా 35కి.మి. దూరంలో మధురపూడి విమానాశ్రయం ఉంది. బిక్కవోలుకు 17 కి.మీ. దూరంలో సామర్లకోట రైల్వేజంక్షన్ కలదు ఇక్కడి నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన రైళ్ళు, కాకినాడ వెళ్ళవలసిన రైళ్ళు విడిపోతాయి. ఇది దక్షిణమధ్యరైల్వే క్రిందకు వస్తుంది

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

బిక్కవోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 432 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1534 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 49 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1485 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

బిక్కవోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1054 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 200 హెక్టార్లు
  • చెరువులు: 214 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 16 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

బిక్కవోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.ఇక్కడ రైతులు వ్యవసాయ రీత్యా నీటికోసం గోదావరి నుండి వస్తున్న కాలువపై ఆధారపడతారు. కానీ వేసవికాలంలో అదికూడా ఎండి పోతే ఊరికి చివర ఉన్న "లింగాలచెరువు" పై ఆధారపడతారు. ఇది వీర్రాజుపేటకు ఒక కి.మి. దూరంలో ఉంది.

ప్రధాన పంటలు మార్చు

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

బియ్యం

నియోజక వర్గం మార్చు

బిక్కవోలు అనపర్తి నియోజకవర్గంలోనికి వస్తుంది. మొత్తం ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి అవి అనపర్తి, బిక్కవోలు, పెదపూడి,రంగంపేట

సంస్కృతి మార్చు

పురాతనమైన, చారిత్రికమైన జైన, శివ ఆలయాలకు, వాటిలోని శిల్పకళా సంపదకు బిక్కవోలును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును.

 
శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయ గోపురం

దేవాలయాలు మార్చు

శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం మార్చు

గోలింగేశ్వర స్వామి ఆలయం గర్భగుడిలో శిలలపై చెక్కబడిన రచనలు ముఖ్యమైనవి. గర్భగుడి ద్వారం శాఖలపైన 33 లైనుల శాసనం చెక్కబడి ఉంది. ముఖమంటపంలో తూర్పు చాళుక్యులనాటి రెండు చక్కని శిల్పాలు భద్రపరచబడి ఉన్నాయి. వీటిలో ఒకటి "ఆలింగన చంద్రశేఖర మూర్తి"గా శివపార్వతుల శిల్పం. మరొకటి కూర్చొని ఉన్న గణేశ ప్రతిమ. ఇవి రెండూ శిల్పకళానైపుణ్యానికి ప్రతీకలు. ఆలయం పైని విమానం ఒడిషా, ఖజురాహోల శైలిని గుర్తు తెస్తుంది.

శ్రీ రాజరాజ ఆలయం మార్చు

మూడు ప్రక్కలా ఉన్న గూడు (విగ్రహ మందిరం)లలో ఒక చోట వినాయకుడు, మరొకదాన్లో నెమలిపై ఆసీనుడైన కార్తికేయుడు, మరొక చోట మహిషాసుర మర్ధనిగా అమ్మవారు, శ్రీరాజరాజేశ్వరీ సమేతులైన శివలింగాకృతి ఉన్నాయి.

శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయం మార్చు

శివలింగానికి నాలుగు ప్రక్కలా అందమైన చంద్రశేఖరస్వామి, బాల త్రిపురసుందరి శిల్పాలున్నాయి.

ఏక శిలా గణేశుడు ఆలయం మార్చు

11 అడుగుల గణేశ విగ్రహం తూర్పు చాళుక్యులనాటి విగ్రహాలన్నింటికంటే పెద్దది. కొంతకాలం రెండు చేతులతో ఉన్న ఈ విగ్రహానికి గుణగవిజయాదిత్యుని కాలంలో మరో రెండు చేతులు చెక్కబడినాయి సాతలూరులో లభించిన గుణగ విజయాదిత్యుని ముద్రికపై ఈ విధమైన గణేశమూర్తి, మరోవైపు లక్ష్మీదేని మూర్తి ఉన్నాయి. ఈ ముద్రిక ఇప్పుడుచెన్నైలోని ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

 
ఏకశిలా వినాయకుడు

1వ శివాలయం మార్చు

గ్రామం శివారులలో ఉన్న శివాలయం మిగిలిన శివాలయాలలాగానే మూడు ప్రక్కల గూడులతో, మకర తోరణాలంకరణతో ఉంది. ఈ శిల్పాలలో ఒక నటరాజమూర్తి చతురభంగిమలో ఉన్నాడు. ఇక్కడ కనిపించే మరొక విశేషం - శివుడు లకులీశునిగా చూపబడడం (లకులీశ, లేదా నకులీశ అనేది పాశుపత శైవాన్ని బోధించిన గురువు. శివుని ప్రతిరూపంగా వారిచే ఆరాధింపబడ్డాడు.[2] తూర్పు గాంగుల నాటిదైన ముఖలింగంలో కూడా దక్షిణామూర్తి లకులీశునిగా చూపబడ్డాడు.

2వ శివాలయం మార్చు

పంట పొలాలలో ఉన్న పెద్ద ఆలయం. ద్వారానికిరువైపులా ద్వారపాలకులు, గుమ్మంపైన లక్ష్మీదేవి విగ్రహాలు తప్ప ఈ ఆలయంలో శిల్పాలు లేకుండా సాదాగా ఉంటుంది.ఆలయం విమానం పల్లవుల కాలపు నిర్మాణశైలిని పోలిఉంటుంది.

3వ శివాలయం మార్చు

ఈ ఆలయం ద్వారానికిరువైపులా గంగ, యమున నదీదేవతల విగ్రహాలున్నాయి. మందిరం పై భాగంలో మైధునం వంటి పలు భంగిమలు చెక్కబడి ఉన్నాయి. సూర్య, విష్ణు విగ్రహాలు గోలింగేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాలను పోలి ఉన్నాయి.

ఉత్సవాలు మార్చు

ఇతర చారిత్రక విషయాలు మార్చు

బిక్కవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 1886 అక్టోబర్ 1న బ్రిటీష్ ప్రభుత్వం ద్వారా 1886 ఫిబ్రవరి 14న ప్రభుత్వ ఉత్తర్వు నెం. 1842న తిరిగి ప్రారంభించబడింది. ఈ ప్రాంతాల ప్రజలను బ్రిటిష్ వారు "కొకనాడా ప్రజలు, రెండవ మద్రాస్ ప్రజలు" అని పిలుస్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత S.R.O లో మొదటి "జెండా ఎగురవేత" 1947 ఆగస్టు 15న సబ్ రిజిస్ట్రార్ ద్వారా బిక్కవోలులో ఎగురవేసారు.

బిక్కవోలు ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు 59 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిని 1960 లో నిర్మించారు .ముందు ముందు రాబోయే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అధికారులు నూతన భవనాలను నిర్మించారు. ఇదే పాఠశాలలో చదువుకొని ఎంతో మంది ఉన్నత పదవులలో ఉన్నారు. ఉదాహరణకు డా.తోటకూర పోతరాజు గారు .సామర్లకోట మండల జెడ్.పి.టి.సిగా పనిచేసిన వీరు బిక్కవోలు గ్రామ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు కొనియాడ దగినవి.

బిక్కవోలు దేవాలయాల దృశ్యమాలిక మార్చు

మూలాలు, వనరులు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. https://www.tamilnet.com/art.html?catid=98&artid=22619

బయటి లింకులు మార్చు