కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై

కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై(-1852) 19వ శతాబ్దిలో చెన్నపట్టణంలోని తెలుగు ప్రముఖుల్లో ఒకరు. ఆయన ప్రజాసేవ, సాంఘిక సంస్కరణలు, సాహిత్య పోషణ వంటి విషయాల్లో కృషి చేశారు. తొలి తెలుగు యాత్రాచరిత్ర కాశీయాత్ర చరిత్ర గ్రంథాన్ని దాని రచయిత, శ్రీనివాస పిళ్ళై స్నేహితుడు అయిన ఏనుగుల వీరాస్వామయ్య మొదట తాను యాత్రలు చేస్తూ లేఖల రూపంలో శ్రీనివాస పిళ్ళైకే వ్రాశారు.[1]

కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై
జననం
పచ్చయప్పా ముదలియార్
మరణం1852
జాతీయతభారతీయుడు
వృత్తివ్యాపారవేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
విద్యాదాత

కుటుంబ నేపథ్యం సవరించు

ఆయన తండ్రి కోమలేశ్వరం మునియప్పిళ్లై. ఆయన కుటుంబం ఆయనాడు చెన్నపట్టణంలో చాలాసంపన్న కుటుంబం.[2]

సంఘసేవ సవరించు

చెన్నపట్టణంలో ప్రజాసేవ చేసిన ఆంధ్రప్రముఖుల్లో శ్రీనివాస పిళ్ళై ఒకరు. చెన్నపట్టణంలో క్షామనివారణ కోసం 1807లో స్థాపించిన మణేగారి సత్రానికి 11మంది బ్రిటీషర్లతో సహా నియమితులైన 9మంది దేశీయ ధర్మకర్తల్లో శ్రీనివాస పిళ్ళై కూడా ఉన్నారు. 1833లో నందననామ సంవత్సర కరువులో పేదలకు అన్నాదికాలు ఇచ్చి ఆయన, వారి స్నేహితులు ఏనుగుల వీరాస్వామయ్య చాలా కృషిచేశారు.[2]

విద్యాభివృద్ధి సవరించు

శ్రీనివాస పిళ్ళై ఉదారభావాలు కలిగిన వ్యక్తి. 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో విప్లవాత్మకమైన ఆలోచనగా పేరొందిన స్త్రీవిద్యకు ఆయన గట్టి సమర్థకులు. స్త్రీ విద్యను వ్యాపింపజేసేందుకు గాను ఆయన బాలికల పాఠశాలను నడిపారు. ఆయన ప్రజల్లో అక్షరజ్ఞానం పెంచేందుకు చాలా కృషిచేశారు. ఆయన చనిపోయేటప్పుడు విద్యాదానం కోసం తన వ్యక్తిగత ఆస్తి నుంచి 70వేల రూపాయలు వ్రాసి మరణించారు. ఆ సొమ్ము నుంచే కొన్నేళ్ళకు హిందూ బాలికాపాఠశాల, ఆపైన పచ్చయ్యప్ప కళాశాల పక్కన మూడవ పాఠశాల స్థాపించారు.[2]

మూలాలు సవరించు

  1. వెంకట శివరావు, దిగవల్లి (1941). కాశీయాత్రా చరిత్ర (పీఠిక) (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  2. 2.0 2.1 2.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; కాశీయాత్ర చరిత్ర అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు