కోమల్ జంజాద్ విదర్భ మహిళల క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1] ఆమె మహారాష్ట్రలోని నాగపూర్ లో 1991 జూలై 10న జన్మించింది. ఆమె తండ్రి రవీంద్ర జంజాద్, తల్లి రజని జంజాద్. అక్క స్నేహాల్ జంజాద్, చెల్లి దర్శన జంజాద్. ఆమె GH రైజానీ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా తీసుకుంది.

కోమల్ జంజాద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కోమల్ రవీంద్ర జంజాద్
పుట్టిన తేదీ (1991-07-10) 1991 జూలై 10 (వయసు 32)
నాగపూర్, మహారాష్ట్ర, భారత దేశము
ఎత్తు5 ft 5 in (1.65 m)
బ్యాటింగుకుడిచేతి వాటము
బౌలింగుఎడమచేతి బౌలింగ్ ఫాస్ట్/మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2023–ప్రస్తుతంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
మూలం: Cricinfo, 3 మార్చ్ 2019

కోమల్ చిన్నప్పటినుండి తమ వీధిలోని అబ్బాయిల (గల్లీ) క్రికెట్ ఆడుతుండేది, క్రమంగా మైదానాలలో సాధన చేసేది. విదర్భ మహిళా క్రికెట్ సంఘం శిబిరంలో ఒక రోజు క్రికెట్ పోటీలో ఆడి, ఈ సంఘంలో తన స్థానం సుస్థిరం చేసుకుంది. 15 సంవత్సరాలకు విదర్భ సంఘం జట్టు తరపున క్రికెట్ ఆడింది.[2]

2018 డిసెంబరులో, హర్యానాతో జరిగిన 2018–19 సీనియర్ మహిళల ఒక రోజు లీగ్ మ్యాచ్‌లో, ఆమె ఎనిమిది పరుగులకు తొమ్మిది వికెట్లు పడగొట్టింది.[3] 2019 జనవరిలో, ఆమె 2018–19 సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీ కోసం ఇండియా రెడ్ జట్టులో ఎంపికైంది.[4]

2019 ఫిబ్రవరిలో, ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో భారత మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (WT20I) జట్టులో ఆమె ఎంపికైంది.[5][6] విదర్భ మహిళల నుంచి జాతీయ జట్టుకు ఎంపికైన ఇద్దరు క్రీడాకారిణుల్లో ఆమె ఒకరు, మరొకరు భారతీ ఫుల్మాలి.[7] WT20I మ్యాచ్‌లకు ముందు, ఆమె 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్‌లో ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఉమెన్ XI జట్టు తరపున ఆడింది, ఆమె ఏడు ఓవర్లలో పద్నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లతో సెలెక్టర్లను ఆకట్టుకుంది.[8][9]

ప్రస్తావనలు మార్చు

  1. "Komal Zanzad". ESPN Cricinfo. Retrieved 3 March 2019.
  2. "Komal zanzad height, age, . . ". Starsunfolded. Retrieved 29 August 2023.
  3. "Left-arm pacer Komal has good chance to impress national selectors". Times of India. Retrieved 3 March 2019.
  4. "Pandey, Raut and Meshram to lead in Challenger Trophy". Cricbuzz. 21 December 2018. Retrieved 1 January 2019.
  5. "Mandhana new T20I captain, Veda Krishnamurthy returns". ESPN Cricinfo. Retrieved 25 February 2019.
  6. "Komal Zanzad and Bharti Fulmali excited to deliver on the International stage". Women's CricZone. Retrieved 3 March 2019.
  7. "Komal, Bharati in Indian women's cricket team". The Hitavada. Archived from the original on 6 March 2019. Retrieved 3 March 2019.
  8. "Komal Zanzad impresses in BP XI loss against England XI". Times of India. Retrieved 3 March 2019.
  9. "Komal Zanzad impresses in Board President XI loss against England XI". Hindustan Times. Retrieved 3 March 2019.

బాహ్య లింకులు మార్చు