కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి

కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రముఖ నాటక రచయిత, కవి, పండితుడు.[1]

కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి
పండిత కె. సుబ్రహ్మణ్యశాస్త్రి
జననం1881
మరణం1934
జాతీయతభారతీయుడు
వృత్తినాటక రచయిత, కవి , పండితుడు.

జననం మార్చు

సుబ్రహ్మణ్యశాస్త్రి 1881లో బళ్ళారిలో జన్మించాడు. ఇతను పండితుడు అవడంవల్ల పండిత కె. సుబ్రహ్మణ్యశాస్త్రిగా ప్రసిద్ధుడు.

రంగస్థల ప్రస్థానం మార్చు

సుబ్రహ్మణ్యశాస్త్రి గద్య, పద్య, గేయాత్మకంగా నాటకాలు రచించాడు. ఈయన నాటకాల్లో దీర్ఘ స్వగతాలు, దీర్ఘ వచనాలు ఎక్కువగా ఉండేవి. లవకుశ, శ్రీకృష్ణలీలలు నాటకాలు వందలసార్లు ప్రదర్శించడమేకాకుండా తమిళ, కన్నడ భాషలలోకి అనువాదం చేయబడ్డాయి.

రచనలు మార్చు

  1. జ్ఞానకృష్ణలీల (1905)
  2. శ్రీకృష్ణలీల (1914)
  3. ప్రౌఢకృష్ణలీల (1915)
  4. లవ-కుశ నాటకము (1915)
  5. విభీషణ పట్టాభిషేక నాటకము (1918)
  6. సంపూర్ణ మహాభారతం (1926)
  7. మేవాడు శౌర్యాగ్ని (1927)
  8. ప్రతాప చరిత్ర (1927)
  9. భోజకాళిదాసీయం (1927)
  10. పద్మిని (1927)
  11. పన్నాబాయి (1927)
  12. భక్తకుచేల (1933)

మరణం మార్చు

ఈయన 1934లో మరణించాడు.

మూలాలు మార్చు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.663.