నాటక రచయిత లేదా రంగస్థల రచయిత నాటకాలు రాసే వ్యక్తి. మనిషికి ఆహ్లాదం అవసరమైనప్పుడు కథలు పుట్టుకు వచ్చాయి. ఆ కథలను వినిపించడం కంటే కనిపించే నటులతో ఆయా కథలలోని పాత్రలు అభినయం చేయడం ఇంకా ప్రాచుర్యం పొందింది. అలా కథలకు రాసే సాహిత్యానికి భిన్నంగా, నాటకానికి ఆనుగుణంగా పాత్రల మధ్య జరిగే సంభాషణ రూపంలో నాటక సాహిత్యం ఉంటుంది. సినిమా ప్రాచుర్యంలోకి రాక ముందు నాటకం ముఖ్య ఆహ్లాద వనరుగా ఉండేది.

పద చరిత్రసవరించు

నాటక రచయిత, నాటకాన్ని రచించే వాడు. నాటకం అనేది నటనకు సాహిత్య రూపం.

చరిత్రసవరించు

నాటకరంగం భారతదేశంలో రెండువేల ఏళ్ళుగా ఉండింది. [1] ప్రాచీన గ్రీసు కాలం నాటి అరిస్టాటిల్ కి సమాంతరంగా భరతముని రచించిన నాట్యశాస్త్రం గ్రంథం నాటకాల ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. ఆ తరువాత శతాబ్దాల పాటూ భారతదేశంలో నాటకానికి ఈ గ్రంథం ఆధారంగా నిలిచింది. వెయ్యేళ్ళ క్రితమే నాటక రచయితలుగా భాసుడు, కాళిదాసు, శూద్రకుడు, విశాఖదత్తుడు, భవభూతి, హర్షుడు మనకు సంస్కృత సాహిత్యంలో ప్రముఖంగా కనిపిస్తారు. మధ్య యుగాల్లో సంస్కృతంలోనే కాక భారతీయ దేశీ భాషల్లో కూడా నాటక రచనలు జరిగాయి. నాటక రంగం కూడా రంగస్థలం నుండి బయట పడి వివిధ రూపాలను సంతరించుకుంది. యక్షగానం, నృత్యరూపకం, బయలాట, తోలుబొమ్మలాట, మొ॥ రూపాంతరాలు మనకు నేడు కనిపిస్తున్నాయి. 18, 19 వ శతాబ్దాల నాటికి పాశ్చాత్య షేక్‌స్పియర్ తరహా పంథాకు మారి భారత దేశీ భాషల నాటక రచన కొత్త రూపం తెచ్చుకుంది. బాంగ్లాలో రబీంద్రనాథ్, కన్నడంలో శంస, కువెంపు, తమిళంలో సుబ్రహ్మణ్య భారతి, మలయాళంలో శ్రీకాంత్ నాయర్, హిందీలో జయశంకర్ ప్రసాద్, భారతేందు హరిశ్చంద్ర నాటక రచయితలుగా బాగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం ఆనాటి సామాజిక దురాచారాలపై గొడ్డలిపెట్టు.

నాటక రచయితలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. హెచెస్, శివప్రకాశ్ (22 May 2012). "The evolution of modern Indian theatre". న్యూస్18. Archived from the original on 13 ఫిబ్రవరి 2018. Retrieved 4 August 2019.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)