కోలా శేషాచలం

తెలుగు రచయిత

కోలా శేషాచలం లేదా కోలా శేషాచల కవి తెలుగులో నీలగిరి యాత్ర అనే వచన గ్రంధాన్ని రచించిన ప్రముఖుడు.

ఇతడు థామస్ సింప్సన్ దొర గారి కచ్చేరిలో మాంగాడు శ్రీనివాస మొదలియారు వద్ద గుమస్తాగా పనిచేసేవాడు. ఇతడు 1846 మే 12 తేదీన చెన్నపట్నం నుండి బయలుదేరి నీలగిరి చేరి 1847 జనవరి 13వ తేదీన స్వగ్రామానికి తిరిగివచ్చాడు. ఆ కాలంలో తాను చూసిన వివరాలు నీలగిరి యాత్ర అనే వచన గ్రంథంగా తరువాతి కాలంలో రచించాడు.

ఇతడి చెన్నపట్టణమునందలి చింతాద్రిపేట నివాసి.[1] ఇతడు తన వంశము గురించి గ్రంథాంతమున చెప్పుకొని యున్నాడు. ఇతడు యాదవ కుల సంజాతుడు. కోలా వీరరాఘవునకు ప్రపౌత్రుడు. తెప్పలనాయకునికి పౌత్రుడు. వెంకటాచల నాయనికి మంగమకు పుత్రుడు. తన తాత ముత్తాతలనే కాక బంధుజాలమంతటిని సీసమాలికలో వర్ణించియున్నాడు. ఇతడు విశిష్టాద్వైత సంప్రదయానుగామి. గణిత శాస్త్రమును మాంగాడు శ్రీనివాస మొదలారి యొద్ద నేర్చుకొన్నట్లు చెప్పుకొనియున్నాడు.

నీలగిరి యాత్ర మార్చు

ఈ గ్రంథంలో మూడు ప్రకరణాలు ఉన్నాయి. నీలగిరి చేరేదాకా జరిగిన వృత్తాంతం తొలి ప్రకరణలోను, నీలగిరి విశేషాలు రెండవ ప్రకరణలోను, తిరుగు ప్రయాణం మూడవ ప్రకరణంలోను ఉన్నాయి. ఈ గ్రంథాన్ని గోడే జగ్గారావు గారికి అంకితమిచ్చాడు.

మూలాలు మార్చు

  1. నీలగిరి యాత్ర, కోలా శేషాచల కవి, మద్రాసు ప్రభుత్వము, చెన్నపట్టణము, 1953.