నీలగిరి యాత్ర

1953 తెలుగు పుస్తకం

నీలగిరి యాత్ర కోలా శేషాచలం రచించిన ఒక తెలుగు వచన గ్రంథం. తెలుగులో యాత్రా చరిత్రలలో ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర (1930-1931) మొదటిది కాగా ఈ రచన రెండవది.

నీలగిరి యాత్ర 1953 పుస్తక ముఖచిత్రం.

మద్రాసు ప్రెసిడెన్సీలోని బ్రిటిష్ అధికారులు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పరివార సమేతంగా నీలగిరికి వెళుతుండేవారు. ఇతడు థామస్ సింప్సన్ దొర కచ్చేరిలో మాంగాడు శ్రీనివాస మొదలియారు వద్ద గుమస్తాగా పనిచేసేవాడు. ఇతడు 1846 మే 12వ తేదీన చెన్నపట్నం నుండి బయలుదేవి నీలగిరి చేరి 1847 జనవరి 13వ తేదీన స్వగ్రామానికి తిరిగివచ్చాడు. మొత్తం యాత్రా సమయం ఏడు నెలలు. ఆ కాలంలో తాను చూసిన వివరాలు నీలగిరి యాత్ర అనే వచన గ్రంథంగా 1854 సంవత్సరంలో రచించాడు. ఈ గ్రంథాన్ని గోడే వేంకట జగ్గారావు గారికి అంకితమిచ్చాడు.

నీలగిరి యాత్రామార్గం

మార్చు

చింత్రాద్రిపేట - పూవిరుందమల్లి - పెరంబూదూరు - ఓచేరి - వాలాజాపేట - రాణిపేట - వేలూరు - పళ్ళికొండ - విరించిపురము - తోటాళము - ఆమూరిపేట - వాణియంబాడి - తిరుప్పత్తియూరు - మత్తూరు - ఇరుమత్తూరు - ధర్మపురి - అదమాన్ కోట -తోర్పూరు - సేలము - కాకాపాళియము - ముద్దునాయని పాళియము - పల్లి పాళియము - ఈరోడు - విజయ మంగళము - అవినాశి - అన్నూరు - మోటు పాళియము - కల్లారు - నీలగిరి శిఖరము - ఉదక మండలం.

వచన కావ్యం

మార్చు

ఈ గ్రంథంలో మూడు ప్రకరణాలు ఉన్నాయి. చెన్నపట్నం నుండి నీలగిరి చేరేదాకా జరిగిన వృత్తాంతం తొలి ప్రకరణలోను, నీలగిరి విశేషాలు రెండవ ప్రకరణలోను, తిరుగు ప్రయాణంలోని వివరాలు మూడవ ప్రకరణంలోను ఉన్నాయి. ఇది ప్రశస్తమైన గ్రాంథిక శైలిలో ఉన్న వనచ గ్రంథం. అయినా ఇందులో కందగర్భిత ప్రమితాక్షర వృత్తం, గర్భగత కందం, నాగబంధం, షష్ఠ్యాంతాలు, స్రగ్విణి, భుజంగ ప్రయాతం, పంచ చామరం, అకార నిరోష్ఠ్య కందం పాదగోపనం, ద్వ్యర్థి పద్యం, పాదగోపనాకృతి, ఉత్పలమాల చంపకమాల వృత్తాలు, సీస పద్యాలు, సీసమాలికలు చేర్చబడడం వలన ఇది వచన కావ్యంగా పేర్కొనబడింది.

యాత్రా రచనకు ప్రేరణ

మార్చు

గోడే సూర్యనారాయణ రాయుడు గారి కుమారుడు వేంకట జగ్గారాయుడు ఆంగ్ల విద్యాభ్యాసం కోసం మద్రాసుకు వెళ్ళాడు. అతడు అక్కడున్న ఎనిమిది సంవత్సరాలలో శేషాచలకవితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వీరి మైత్రికి గుర్తుగా ఒక కావ్యాన్ని వ్రాసి అంకితమివ్వాలని అనుకున్నా కావ్యానికి తగిన ఇతివృత్తం దొరకలేదు. చివరికి యాత్రా విశేషాలనే వచన కావ్యంగా మలచాలని అలోచన వచ్చింది. తాను యాత్రాకాలంలో దినచర్యగా వ్రాసుకున్న అనుభవాల ఆధారంగా నీలగిరి యాత్రను పుస్తకంగా రచించి మితృనికి అంకితం ఇచ్చాడు.

ముద్రణ

మార్చు

మూలాలు

మార్చు
  • సమగ్రాంధ్ర సాహిత్యం, ఆరుద్ర మూడవ సంపుటి, తెలుగు అకాడమి, హైదరాబాదు, పేజీలు: 244-5.
  • నీలగిరి యాత్ర, కోలా శేషాచలకవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2004.

బయటి లింకులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: