కోసల కులశేఖర

శ్రీలంకకు చెందిన క్రికెటర్

చమిత్ కోసల బండార కులశేఖర, శ్రీలంకకు చెందిన క్రికెటర్. ఆల్ రౌండర్, కుడిచేతి బ్యాటింగ్, కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలింగ్ చేస్తాడు.

కోసల కులశేఖర
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చమిత్ కోసల బండార కులశేఖర
పుట్టిన తేదీ (1985-07-15) 1985 జూలై 15 (వయసు 39)
మావనల్లే, శ్రీలంక
ఎత్తు6 అ. 1 అం. (1.85 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 121)2011 నవంబరు 3 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 149)2011 నవంబరు 11 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2012 జనవరి 17 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
Nondescripts Cricket Club
Kandurata Warriors
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 4 73 84
చేసిన పరుగులు 22 22 2,773 1,493
బ్యాటింగు సగటు 11.00 11.00 25.91 26.19
100లు/50లు 0/0 0/0 2/14 0/5
అత్యుత్తమ స్కోరు 15 15 129 74
వేసిన బంతులు 168 78 6,796 2,837
వికెట్లు 1 0 149 71
బౌలింగు సగటు 80.00 26.79 30.42
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/65 6/13 4/27
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 1/– 35/0 26/0
మూలం: Cricinfo, 2017 జనవరి 23

చమిత్ కోసల బండార కులశేఖర 1985, జూలై 15న శ్రీలంకలోని మావనల్లేలో జన్మించాడు.

దేశీయ క్రికెట్

మార్చు

నాన్‌డ్‌స్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్, రుహునా రైనోస్ కోసం దేశీయ క్రికెట్ ఆడాడు. ఎస్ఎల్సీ సూపర్ 4 టీ20 టోర్నమెంట్‌లో వెస్ట్రన్ ట్రూపర్స్ సభ్యుడిగా కూడా ఉన్నాడు.[1] 2018 ఏప్రిల్ లో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం దంబుల్లా జట్టులో ఎంపికయ్యాడు.[2]

2004 శ్రీలంక ఐసీసీ యూత్ వరల్డ్ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఉపుల్ తరంగ, ఫర్వీజ్ మహరూఫ్, కౌశల్ సిల్వా, సూరజ్ రందీవ్‌లతో కలిసి తన అండర్-19 క్రికెట్ ఆడాడు.

బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో మెచ్చుకోదగిన ప్రదర్శన చేశాడు. కెనడాపై 5/27, జింబాబ్వేపై 37 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.

తన కెరీర్‌లో తరువాత, అతను బదురలియా ఎస్సీకి మారాడు.

అంతర్జాతీయ కెరీర్

మార్చు

ఒక టెస్టులో ఆడాడు. 2011లో షార్జాలో పాకిస్తాన్‌పై అరంగేట్రం చేశాడు. 2011 నవంబరు 11న దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అదే పర్యటనలో వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.

మూలాలు

మార్చు
  1. "Kosala Kulasekara powers Troopers to big win". ESPNcricinfo. Retrieved 2023-08-21.
  2. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-21.

బాహ్య లింకులు

మార్చు